విద్యుత్ సమాచారం online shopping http://vidyut1.blogspot.in/2016/07/on-line-marketing-links.html

Powered by Blogger.

నా గురించి విషయాలు

BTemplates.com

Blogroll

Saturday, June 4, 2016

ఎలాంటి వాషింగ్ మెషీన్ తీసుకుంటే బెటర్?టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్.. ఏది బెటర్?వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం!


ఎలాంటి వాషింగ్ మెషీన్ తీసుకుంటే బెటర్?


Related Image
ఉరుకులు పరుగుల జీవితం.. ఇంట్లో ఏ పనీ చేయడానికి తీరిక ఉండదు.. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగస్తులైతే మరింత ఇబ్బంది.. బట్టలు ఉతుక్కోవడానికి సమయం ఉండదు. పైగా శ్రమ ఎక్కువ. అదే వాషింగ్ మెషీన్ కొనుక్కుంటే పని సులువైపోతుంది. శ్రమ తగ్గుతుంది. సమయం మిగులుతుంది. కానీ వాషింగ్ మెషీన్లలో ఎన్నో రకాలు, మరెన్నో మోడల్స్, ఇంకెన్నో సౌకర్యాలు ఉంటున్నాయి. అందులో మన అవసరానికి, మన బడ్జెట్ కు తగిన వాషింగ్ మెషీన్ ను ఎంచుకునేదెలాగో తెలుసుకుందాం..
ఎన్ని రకాలు ఉన్నాయి?
వాషింగ్ మెషీన్లలో ప్రాథమికంగా ‘సెమీ ఆటోమేటిక్’, ‘ఫుల్లీ ఆటోమేటిక్’ అని రెండు రకాలున్నాయి. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లలో ఉతికేందుకు, నీటిని పిండేసేందుకు రెండు వేర్వేరు టబ్ లు ఉంటాయి. ఉతుకు స్థాయి, సమయం, నీటి శాతం వంటివన్నీ మాన్యువల్ గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లలో ఒకే టబ్ ఉంటుంది. ఉతికే ప్రక్రియ అంతా దాదాపుగా ఆటోమేటిగ్గా జరిగిపోతుంది. మళ్లీ ఫుల్లీ ఆటోమేటిక్ లో టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ అని రెండు రకాలు ఉన్నాయి. దాదాపు అన్ని రకాల వాషింగ్ మెషీన్ల ప్రాథమిక పనితీరు ఒక్కటే. కానీ ఈ మూడు రకాల్లో దేనికదే కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు, సౌకర్యాలు కలిగి ఉంటాయి.
సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు
పేరుకు తగినట్లే వీటిల్లో కొంత పనిని మెషీన్ చేస్తే.. కొంత పనిని మాన్యువల్ గా మనం చేయాల్సి ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లన్నీ టాప్ లోడింగ్ తరహాకు చెందినవే ఉంటాయి (అంటే మెషీన్ పైభాగంలో నుంచి బట్టలు వేయాల్సి ఉంటుంది). వీటిల్లో ఉతకడానికి, వేగంగా తిప్పడం ద్వారా నీటిని పిండేయడానికి రెండు వేర్వేరు టబ్ లు ఉంటాయి. అందువల్ల వీటి పరిమాణం కూడా పెద్దగా ఉంటుంది. అయితే వీటి ధర చాలా తక్కువగా ఉంటుంది.
వీటితో చాలా ఇబ్బందులు
  • మెషీన్లో వేసిన బట్టలకు అనుగుణంగా ఉతకాల్సిన తీరును, నీటి శాతాన్ని, సమయాన్ని మ్యాన్యువల్ గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మెషీన్ పై ఉండే నాబ్ లను తిప్పాలి.
  • ఉతికే ప్రక్రియ ముగిశాక ఆ టబ్ లోనుంచి బట్టలను తీసి రెండో టబ్ లో వేసి, స్పిన్నింగ్ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి వస్తుంది. 
  • మూత తీసి ఉండడం, నీటి సరఫరా ఆగిపోవడం వంటివాటిని గుర్తించి మెషీన్ హెచ్చరించే సదుపాయాలు ఉండవు
  • వీటి పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల స్థలం ఎక్కువగా అవసరం.
  • వస్త్రాల ఉతుకులో కఠినంగా ఉంటుంది. అందువల్ల త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కఠినమైన మరకలను కూడా తొలగించగలగడం ఒక ప్రయోజనం.
టాప్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లు
అటు ఆటోమేటిక్ సదుపాయాలు, ఇటు తక్కువ ధరకు లభించడం ఈ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల వల్ల లభించే ప్రయోజనం. దీనిలో ఒకే టబ్ ఉంటుంది. అందులోనే బట్టలు ఉతకడంతోపాటు నీటిని పిండేసే (స్పిన్నింగ్ ద్వారా) సదుపాయం ఉంటుంది. అందువల్ల వీటి పరిమాణం తక్కువగా ఉంటుంది. ఫ్రంట్ లోడ్ తో పోలిస్తే.. చాలా తక్కువ ధరకే లభిస్తాయి. 5.5 - 6 కేజీల ప్రారంభ మోడల్ లు కంపెనీని బట్టి 11,000 నుంచి 17,000 రూపాయల వరకు ఉంటాయి. 
వీటితో ఇబ్బందులేమిటి?
  • టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల నీటి వినియోగం చాలా ఎక్కువ. టబ్ లో వేసిన బట్టలన్నీ మునిగేదాకా నీరు అందాల్సి ఉంటుంది.
  • 6 కేజీల సామర్థ్యమున్న మెషీన్ పూర్తి వాషింగ్ సైకిల్ కు సుమారు 110 నుంచి 140 లీటర్ల వరకూ నీటిని వినియోగించుకుంటుంది.
  • సాధారణంగా టాప్ లోడ్ మెషీన్లలో వాటర్ హీటింగ్, హీటింగ్ డ్రైయర్ సదుపాయాలు ఉండవు.
  • బట్టలు ఉతికిన నీటిని బయటకు పంపించేందుకు ప్రత్యేకమైన మోటార్ ఉండదు. వాషింగ్ మెషీన్ అడుగున ఉండే ‘ఔట్ లెట్’ పైపుతో సమానమైన ఎత్తులోనే నీరు బయటికి వస్తుంది. పైపు ఎత్తుగా పెడితే మురికి నీరు బయటికి పోకుండా ఆగిపోతుంది.
ఫ్రంట్ లోడ్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్
దీనిలోనూ ఒకే టబ్ లో వాషింగ్, డ్రైయింగ్ జరిగినా మరెన్నో అదనపు సదుపాయాలూ ఉంటాయి. దీనిలో బట్టలను మెషీన్ ముందువైపు నుంచి లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ టబ్ అడ్డంగా తిరుగుతుండడం వల్ల బట్టలు నీటిలో మునుగుతూ బయటికి వస్తూ ఉంటాయి. అందువల్ల దీనిలో నీటి వినియోగం తక్కువ. చాలా వరకు ఫ్రంట్ లోడ్ మెషీన్లలో వాటర్ హీటింగ్ సదుపాయం ఉంటుంది. చిన్న పిల్లల బట్టలు, బాగా మురికిగా ఉన్న బట్టలు శుభ్రం కావడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. కొన్ని హై ఎండ్ మోడళ్లలో హీటింగ్ డ్రైయర్ సదుపాయం కూడా ఉంటుంది. ఇది వేడి ద్వారా వస్త్రాలను ఆరబెడుతుంది. అంటే మెషీన్ లోంచి బట్టలు తీసుకుని నేరుగా వేసుకునేందుకూ వీలవుతుంది.
ఇబ్బందులూ ఉన్నాయి..
  • ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల ధరలు చాలా ఎక్కువ. 5.5 - 6 కేజీల ప్రారంభ మోడల్ ధరలే 20,000 రూపాయలకు పైగా ఉంటాయి.
  • బట్టలు ఉతకడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దాంతో విద్యుత్ వినియోగం ఎక్కువ. వాటర్ హీటింగ్, డ్రైయర్ ఆప్షన్లు ఉపయోగిస్తే విద్యుత్ వినియోగం మరింతగా పెరుగుతుంది.
టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్.. ఏది బెటర్?
  • ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు తక్కువ నీటిని వినియోగించుకుంటాయి. కానీ ఉతకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంటే అంతసేపూ విద్యుత్ ను వినియోగించుకుంటాయి.
  • టాప్ లోడ్ వాషింగ్ మెషీన్ల నీటి వినియోగం ఫ్రంట్ లోడ్ కంటే దాదాపు రెండింతలు ఎక్కువ. కానీ ఉతకడానికి తీసుకునే సమయం తక్కువ. అంటే తక్కువ విద్యుత్ ఖర్చవుతుంది.
  • రెండు రకాల మెషీన్లలోను డోర్ ఓపెన్ అలారం, వాషింగ్ కంప్లీట్ సిగ్నల్, విద్యుత్ సరఫరాలో అంతరాయం వస్తే ఆటో రెస్యూమ్ స్టార్ట్, ఆటో ఆఫ్ వంటి సదుపాయాలు ఉంటాయి.
  • చాలా వరకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో హీటింగ్ సదుపాయం ఉంటుంది. టాప్ లోడ్ లో ఉండదు. హీటింగ్ సదుపాయం అవసరం లేకపోతే టాప్ లోడ్ తీసుకోవచ్చు.
  • ధర విషయానికి వస్తే ఫ్రంట్ లోడ్ మెషీన్ల ధరలు చాలా ఎక్కువ.  
ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటే మరింత ఆదా
ఇటీవల ఇన్వర్టర్ టెక్నాలజీని వినియోగించుకునే వాషింగ్ మెషీన్లూ వస్తున్నాయి. సాధారణ మెషీన్లు ఏదో ఒక స్థాయి లోడ్ ను ఆధారంగా చేసుకుని పూర్తి వేగంగా పనిచేసేలా తయారు చేయబడి ఉంటాయి. కానీ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న మెషీన్లు అందులో ఉన్న లోడ్ ను బట్టి అవసరమైన వేగంతోనే తిరుగుతాయి. దీంతో విద్యుత్ ఆదా అవుతుంది.
సరికొత్తగా డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ
సాధారణ వాషింగ్ మెషీన్లలో టబ్ ను తిప్పే మోటార్ ఒకే సామర్థ్యంతో నేరుగా పనిచేస్తుంది. కానీ కొత్తగా వచ్చిన డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో తయారైన మెషీన్లలో మోటార్ కు టబ్ గేర్ బాక్స్ తో అనుసంధానమై ఉంటుంది. ఉదాహరణకు కారు లేదా బైక్ మీద వెళుతున్నప్పుడు గేర్లు మార్చినట్లుగా... వాషింగ్ మెషీన్ పనిచేస్తుండగా అవసరమైన వేగాన్ని బట్టి ఆటోమేటిగ్గా గేర్లు మారుతుంటాయి. దీనివల్ల మెషీన్ మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది, తక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటుంది.
కొనే ముందు ఇవి గమనించండి..
  • ప్రధానంగా మీ రెగ్యులర్ అవసరాలకు తగిన వాషింగ్ మెషీన్ నే ఎన్నుకోండి. అవసరానికన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్నది తీసుకుంటే అనవసరంగా విద్యుత్ ఖర్చు పెరుగుతుంది. నీటి వృథా కూడా జరుగుతుంది.
  • ఒక్కో వాషింగ్ కు మెషీన్ ఎన్ని నీటిని తీసుకుంటుందో తెలుసుకోండి.
  • స్టెయిన్ లెస్ స్టీల్ టబ్ ఉంటే మన్నిక ఎక్కువగా ఉంటుంది.
  • ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మెషీన్ ను ఎంచుకోండి. వాటి విద్యుత్, నీటి వినియోగం తక్కువగా ఉంటుంది. (2016 జనవరి తర్వాత నుంచే భారతదేశంలో వాషింగ్ మెషీన్లకు స్టార్ రేటింగ్ అమల్లోకి వచ్చింది. అంతకుముందు వీటికి స్టార్ రేటింగ్ లేదు.)
  • ఆటో లోడ్ సెన్సర్ ఉన్న వాషింగ్ మెషీన్ ను ఎంచుకోండి. అంటే వాషింగ్ మెషీన్ లో వేసిన బట్టలకు అనుగుణంగా అది నీటిని తీసుకుంటుంది. దీంతో నీటి వృథా ఉండదు.
  • ఫ్యాబ్రిక్ కండిషనర్ డిస్పెన్సర్ ఉందో లేదో చూడండి. ఈ సదుపాయం ఉన్న వాషింగ్ మెషీన్లలో చివరి సైకిల్ లో (స్పిన్నింగ్ కు ముందు) కండిషనర్ విడుదలై వస్త్రాలకు చేరుతుంది.
  • సోకింగ్ (నానబెట్టడం), ప్రీ సోక్ సైకిల్ (నానబెట్టే ముందు డిటర్జెంట్ పూర్తిగా కరిగి బట్టలకు పట్టుకునేలా కొద్దిసేపు తిరగడం), డిలే వాష్ (నిర్ణీత సమయం తర్వాత ఉతకడం), డిజిటల్ డిస్ప్లే, వివిధ రకాల వాషింగ్ ఆప్షన్లు, జెట్ స్ట్రీమ్ లేదా వాటర్ ఫాల్ (టబ్ లో పై నుంచి నీరు జెట్ లాగా చిమ్ముతూ ఉంటుంది), ప్లాస్టిక్ టబ్ / స్టెయిన్ లెస్ స్టీల్ టబ్ వంటి అదనపు ఆప్షన్ల ఆధారంగా ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి.
  • డైరెక్ట్ డ్రైవ్, ఇన్వర్టర్ టెక్నాలజీలు ఉన్న వాషింగ్ మెషీన్ల ధర చాలా ఎక్కువగా ఉంటుంది. వినియోగం చాలా ఎక్కువగా ఉంటే తప్ప ఇలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.
  • వాషింగ్ మెషీన్ కు ఎంత కాలం వారెంటీ ఇస్తున్నాయో చూడండి. కొన్ని కంపెనీలు మోటార్ పై ఐదు నుంచి పదేళ్ల వరకు వారెంటీ ఇస్తున్నాయి. 
  • మంచి కంపెనీ, విస్తృతమైన సర్వీసు నెట్ వర్క్ ఉన్నకంపెనీ వాషింగ్ మెషీన్ ను ఎంచుకోండి.
సరైన డిటర్జెంట్ ను వినియోగించడం అవసరం
ఎక్కువ సామర్థ్యమున్న వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేసినా.. సరైన డిటర్జెంట్ ను వినియోగించకపోతే బట్టల ఉతుకు సరిగా ఉండదు. సాధారణ డిటర్జెంట్లతో నీటిలో ఎక్కువ నురగ ఏర్పడుతుంది. దీంతో తక్కువ నీటిని వినియోగించుకునే అభివృద్ధి చేసిన వాషింగ్ మెషీన్లలో ఉతికే వస్త్రాల్లో డిటర్జెంట్ కొంత ఉండిపోతుంది. అందులోనూ టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో ఉతికే సాంకేతికత కొంత వేరుగా ఉంటుంది. అందువల్ల తక్కువ నురగ ఇస్తూ మురికిని సమర్థవంతంగా తొలగించే డిటర్జెంట్లు వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని డిటర్జెంట్ కంపెనీలు బ్రాండ్ నేమ్ తో పాటు ‘మేటిక్’ అనే పేరుతో వాషింగ్ మెషీన్లకే ప్రత్యేకమైన ఉత్పత్తులను మార్కెట్ లోకి తెచ్చాయి.
వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • వీలైనంత వరకూ వాషింగ్ మెషీన్ ను పూర్తి సామర్థ్యం మేరకు వినియోగించడం మంచిది. దాని వల్ల విద్యుత్, నీరు వృథా కాకుండా ఉంటాయి.
  • సరైన డిటర్జెంట్ ను, సరైన మోతాదులో వినియోగించండి. నాణ్యత లేని డిటర్జెంట్ వల్ల బట్టలు సరిగ్గా శుభ్రం కావు. అవసరానికి మించి వేస్తే ఇటు వస్త్రాలపై పేరుకుపోవడం, అటు వృథా కావడం రెండూ జరుగుతాయి. కొన్ని కంపెనీలు టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల కోసం ప్రత్యేకమైన డిటర్జెంట్లను మార్కెట్లోకి తెచ్చాయి. వాటిని వినియోగించడం మేలు.
  • వాటర్ హీటింగ్ సదుపాయం ఉన్న వాషింగ్ మెషీన్లలో అవసరమైతేనే దానిని వినియోగించండి. లేకపోతే బట్టలు పాడవడంతోపాటు విద్యుత్ కూడా వృథా అవుతుంది.
  • డ్రైయర్ (థర్మల్ హీటింగ్ తో దుస్తులను ఆరబెట్టడం) సదుపాయం ఉన్న వాషింగ్ మెషీన్లలో.. దానిని వినియోగిస్తే విద్యుత్ వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో తప్ప సాధారణ సమయాల్లో వాషింగ్ మెషీన్ లోని స్పిన్ ఆప్షన్ ను వినియోగించుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది.
  • వాషింగ్ మెషీన్ కు నీటిని అందించే ‘ఇన్ లెట్’ పైపులో ఎలాంటి అడ్డంకులు, చెత్త పేరుకోకుండా చూడండి. లేకుంటే నీరు సరిగా అందదు.
  • ఇన్ లెట్ పైపు వాషింగ్ మెషీన్ కు అనుసంధానమయ్యే భాగంలో సన్నటి జల్లెడ ఉండి, చెత్తా చెదారం లోనికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దానిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
  • మురికి నీటిని బయటికి పంప్ చేసే మోటార్లు లేని మెషీన్లలో.. నీరు బయటికి వెళ్లే ‘ఔట్ లెట్’ పైపు సరైన ఎత్తులో ఉందా లేదా చూసుకోవాలి. ఔట్ లెట్ కంటే పైపు ఎత్తులోకి పెడితే నీరు బయటికి వెళ్లక.. మెషీన్ ఆగిపోతుంది.
డ్రైయర్ లతో మరింత సౌలభ్యం
సాధారణంగా వాషింగ్ మెషీన్ లో బట్టలు ఉతికినా వాటిని బయట ఆరవేయాల్సిందే. కానీ అపార్ట్ మెంట్లలో ఉండేవారికి, ఏ మాత్రం ఖాళీ స్థలం లేని, ఎండ పడని ఇళ్లలో ఉండేవారికి బట్టలు ఆరవేయడం ఓ సమస్య. అలాంటి వారు క్లాత్ డ్రైయర్ లను కొనుగోలు చేసుకోవచ్చు. దాదాపుగా వాషింగ్ మెషీన్ల తరహాలోనే ఉండే డ్రైయర్లు వేడి గాలిని పంపుతూ, టబ్ ను తిప్పడం ద్వారా బట్టలు ఎండిపోయేలా చేస్తాయి. టబ్ లో ఉండే రంధ్రాల ద్వారా వచ్చే వేడి గాలి ద్వారా బట్టల్లో ఉండే నీరు ఆవిరి అవుతుంది. ఆ ఆవిరి గాలి బయటకు వెళ్లిపోతూ.. పొడిగా ఉండే వేడి గాలి లోపలికి వస్తుంటుంది. వాషింగ్ మెషీన్లలో ఉతికిన బట్టలను డ్రైయర్లో వేస్తే కొద్ది సేపట్లోనే నేరుగా వినియోగించుకోవడానికి వీలుగా ఎండిపోతాయి.
  • క్లాత్ డ్రైయర్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. సాధారణ ఇళ్లలో అయితే బట్టలు ఉతకడానికి అయ్యే విద్యుత్ కన్నా.. డ్రైయర్ కే ఎక్కువ ఖర్చవుతుంది. అంటే సుమారు ఒక్కసారికి 1.4 యూనిట్ల నుంచి 4 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగమవుతుంది.
  • ఎక్కువగా సమయం ఉండనివారు, బట్టలు ఆరేసుకోవడానికి స్థలం లేనివారు డ్రైయర్ ను తీసుకుంటే మేలు.
  • ఎప్పటికప్పుడు బెడ్ షీట్లు, వస్త్రాలు ఉతకాల్సిన అవసరముండే ఆస్పత్రులు, హాస్టళ్లు వంటి వాటికి మాత్రం డ్రైయర్లతో ప్రయోజనం ఎక్కువ.
  • క్లాత్ డ్రైయర్ల కారణంగా వస్త్రాల ఉపరితలంపై సన్నని పోగులు ఊడిపోతుంటాయి. ఫలితంగా వస్త్రాలు త్వరగా పాడవుతాయని గుర్తుంచుకోవాలి.
  • డ్రైయర్ కొనాలనుకుంటే మాయిశ్చర్ (తేమ) సెన్సర్ ఉన్న వాటిని ఎంచుకుంటే మేలు. డ్రైయర్ లో బట్టలు ఎండిపోయిన కొద్దీ వాటి నుంచి వెలువడే తేమ తగ్గిపోతుంది. దీనిని సెన్సర్ గుర్తించి.. డ్రైయర్ ను ఆపేస్తుంది. తద్వారా కొంత వరకు విద్యుత్ పొదుపు అవుతుంది.
  • డ్రైయర్లలో వాషింగ్ మెషీన్ మాదిరిగా టబ్ తరహా వాటితోపాటు కేబినెట్ డ్రైయర్లూ ఉంటాయి. ఇవి ఒక బీరువా తరహాలో కాస్త చిన్నగా ఉంటాయి. వీటిల్లో ఉండే రాడ్ లపై వస్త్రాలను ఉంచితే.. వేడి గాలి ద్వారా ఆరబెడతాయి. మడవలేని వస్త్రాలు, ోట్ లు, సున్నితమైన వస్త్రాలకు ఈ తరహా డ్రైయర్లు బెటర్.

0 comments:

Post a Comment