విద్యుత్ ఆదాచేయుటకు సూచనలు
ఇలా చేస్తే విద్యుత్ ఆదా
అసలే వేసవికాలం.. ఇప్పటికే ఎండలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి.. ఇంట్లో ఉందామంటే ఉక్కపోత.. 24గంటలు కూలరు, ఫ్యాను తిరగాల్సిందే.. చల్లటి నీళ్ల కోసం ఫ్రిజ్ నడవాల్సిందే.. దీంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. నిన్నా మొన్నటి వరకు ఓ మధ్య తరగతి కుటుంబం నెలవారీ వినియోగం 100 నుంచి 150 యూనిట్లను మించకపోయేది. కానీ, ఈ ఎండల వేడి నుంచి ఉపశమనం పొందాలంటే కూలర్లు, ఫ్రిజ్‌లను వాడక తప్పని పరిస్థితి. ఇక ఏసీలను వినియోగించే వారికైతే 200యూనిట్లు దాటిపోతాయి. శ్లాబు మారిందంటే ఆ మేరకు విద్యుత్ భారం పడుతుంది. ఎండాకాలం మొత్తం విద్యుత్ బిల్లు ఎక్కువగానే వచ్చే అవకాశం ఉంది. దీనికి తోడుగా విద్యుత్ రీడింగ్ తీసే సిబ్బంది ప్రతి నెలా ఒకే తేదీల్లో రీడింగ్ తీయకపోయినా స్లాబు మారే అవకాశం పుష్కలంగా ఉంది. అయితే విద్యుత్ వినియోగంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తే, స్లాబులు మారకుండా విద్యుత్ బిల్లుల భారాన్ని కొంచమైనా తగ్గించుకునే అవకాశం ఉంది.
శ్లాబు మారకుండా..
ఈ వేసవిలో విద్యుత్ బిల్లుల భారం కొంచమైన తగ్గించుకోవాలంటే చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే, వినియోగం పెరిగినా శ్లాబు మారకుండా చూసుకోవచ్చు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఓ ఇంటిలో సరాసరిన రోజుకు రెండు యూనిట్లు విద్యుత్ ఆదా అవుతుందని నిపుణులు అంటున్నారు. ఏదైనా కొత్త విద్యుత్ గృహోపకరణాలు కొనాలనుకుంటే తక్కువ విద్యుత్‌తో ఎక్కువ పనితనం చూపే వాటికి ప్రాధాన్యమివ్వాలి.
ఇలా చేస్తే మేలు ఏసీలు, ఎయిర్ కూలర్లు..
ఏసీలు ఆన్‌లో ఉన్నప్పుడు తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. కిటికీలకు సన్‌ఫిల్మ్, ముదురు కర్టెన్లను ఏర్పాటు చేసుకోవాలి.
సీలింగ్ ఫ్యాన్‌ను ఆన్‌లో ఉంచడం ద్వారా ఏసీని కొంచెం అధిక ఉష్ణోగ్రత వద్ద సెట్టింగ్‌లో ఉంచవచ్చు.
సాధారణ చల్లదనం కోసం 24 డిగ్రీల వద్ద సెట్ చేసుకోవాలి. సెట్టింగ్ తగ్గించడం (డిగ్రీలు పెంచడం ) వల్ల ప్రతి సెంటీగ్రేడ్‌కు కనీసం 5 శాతం విద్యుత్ ఆదా అవుతుంది.
ఇంటి పైకప్పులపై కూల్ ఫామ్, చల్లటి గడ్డి కప్పడం ద్వారా కరెంటు అవసరం తక్కువగా ఉండేలా చూడొచ్చు.
ఏసీ గదిలో బల్బులు, ట్యూబ్‌లైట్లు లేకుండా చూడాలి.
లైట్లు, ఫ్యాన్లు..
* వేసవి కాలంలోనూ మధ్యాహ్నం సమయాల్లోనే అనేక ఇళ్లల్లో లైట్లను వేసే ఉంచుతారు. దీని వల్ల ఇంటిలో వేడి పెరుగుతుంది. పొద్దంతా ఇళ్లల్లో లైట్లు వేయకపోవడమే మంచిది. అలాగే ఎల్‌ఈడీ లైట్లకు ప్రాధాన్యమివ్వడంలాంటివి చేస్తే అవి వినియోగించే విద్యుత్‌లో 40శాతం వరకు ఆదా చేయవచ్చు.
* పగలు వీలైనంత వరకు తలుపులు, కిటికీలు తీసి సహజమైన వెలుతురు, గాలిని వినియోగించుకోవాలి. అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపేయాలి.
* ఫిలమెంట్ బల్బుకు బదులు తక్కువ విద్యుత్‌తో అధిక వెలుగునిచ్చే సీఎఫ్‌ఎల్ బల్బులు వాడాలి.
* 5 తరహా ట్యూబ్‌లైట్లను వాడాలి. బల్బులు, ట్యూబ్‌లైట్లను నెలకోసారి శుభ్రం చేయాలి.
* ఎల్‌ఈడీ బల్బుల వాడకం వల్లకూడా విద్యుత్ ఆదా చేయొచ్చు.
* అవసరముంటే తప్ప బయట ఒకటికి మించి బల్బులను బిగించకపోవడమే మంచిది.
* ఫ్యాన్లకు ఎలక్ట్రిక్ రెగ్యులేటర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలి. ఫ్యాన్ల బేరింగులకు ఏటా గ్రీస్ పెట్టాలి.
* 50వాట్స్ సీలింగ్ ఫ్యాన్లను వాడాలి.
ఫ్రిజ్
ఫ్రిజ్ డోర్లను వీలైనంత తక్కువసార్లు తెరవాలి.
ఫ్రిజ్‌లను వేడి ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. గోడకు కనీసం 6 నుంచి 8 ఇంచుల దూరంలో పెట్టాలి. ముఖ్యంగా పడక గదిలో పెట్టకూడదు.
ఫ్రిజ్‌లో చల్లదనం లేకున్నా ఎక్కువసార్లు కంప్రెషర్ ఆన్/ఆఫ్ అవుతున్నా, బాడీ బాగా వేడెక్కుతున్నా వెంటనే మెకానిక్‌ను సంప్రదించాలి.
వేడి పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు. దీని వల్ల విద్యుత్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలు పెడితే మూతపెట్టాలి. లేదంటూ వీటిలోని తేమ ఆవిరై మరింత శక్తితో పని చేయాల్సి ఉంటుంది.
వాషింగ్ మిషన్
* ఆటోమెటిక్, సెమీ ఆటోమెటిక్ వాషింగ్‌మిషన్లలో బట్టలు ఉతికేటప్పుడు డ్రైయర్‌ను వాడకుండా, దాని పూర్తిసామర్థ్యం మేరకు పని చేయించాలి.
* బట్టలను ముందుగా నానబెట్టాక, వాషింగ్ మిషన్‌లో వేస్తే కరెంటు ఆదా అవుతుంది. అలాగే ఉతికిన బట్టలను ఆరుబయట ఆరేయడం ఉత్తమం.
* వీలైనన్ని ఎక్కువ బట్టలను ఒకేసారి ఉతకాలి.
* తక్కువ సమయాన్ని (టైమర్) సెట్ చేసుకుని, సరైన పాళ్లలో నీటిని డిటర్జంట్‌ను వాడాలి.
టీవీ, కంప్యూటర్
వినియోగంలో లేనప్పుడు టీవీ, కంప్యూటర్ మెయిన్ స్విచ్‌లు బంద్ చేయాలి. కరెంటు పోయినా స్విచ్‌లు ఆఫ్ చేసి ఉంచాలి.
కొంతమంది టీవీ, కంప్యూటర్ ఆన్‌చేసి తమ పనుల్లో తాము నిమగ్నమైపోతారు. మీలాగానే వేలాది, లక్షలాది మంది చేస్తే పరిస్థితి ఏంటి? రేపటి రోజున మీరు బిల్లు కట్టేందుకు సిద్ధంగా ఉన్నా ఇచ్చేందుకు సర్కారు వద్ద కరెంట్ ఉండదు. అది గుర్తుంచుకొని నడుచుకుంటే భావితరాలకు ఎంతో మేలు చేసినవాళ్లమవుతాం.
అవసరం లేనప్పుడు దోమల మిషన్లు, సెల్ చార్జర్లను ప్లగ్ నుంచి తీసేయాలి.
మిక్సర్ గ్రైండర్..
మోటారు, మిక్సీ, గ్రైండర్‌లాంటివి పీక్ అవర్స్(ఎక్కువ వినియోగం జరిగే ఉదయం, సాయంత్రం వేళ)లో వినియోగించవద్దు. ఆ సమయంలో వినియోగిస్తే ఆయా పరికరాలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరగక పూర్తి సామర్థ్యంతో పనిచేయవు. దీంతో అదనంగా విద్యుత్ వ్యయమవుతుంది. ఉదాహరణకు ఎక్కువగా విద్యుత్ వాడకం జరిగే సాయంత్రం సమయంలో మోటారు వేస్తే 15 నిమిషాల్లో నిండాల్సిన ట్యాంకుకు ఇరువై నిమిషాలు పడుతుంది.
చాలా ఇళ్లలో నీటి ట్యాంకు నింపేందుకు మోటారు వేస్తారు. ట్యాంకు నిండి నీళ్లు వృథాగా పోతున్నా మోటార్లను ఆఫ్ చేయరు. కొంచెం జాగ్రత్త వహిస్తే విలువైన నీరు వృథాగా పోకుండా చూస్తే, ఇటు విద్యుత్‌తో పాటు అటు నీటిని ఆదా చేసినట్లే.
ఎలక్ట్రికల్ స్టౌ.. మ్రైకోఓవెన్..
ఎలక్ట్రిక్ స్టౌ బదులు మైక్రో ఓవెన్‌ను వాడడం ద్వారా 50 శాతం విద్యుత్‌ను ఆదా చేయొచ్చు.
పదార్థాలను పరిశీలించేందుకు మైక్రో ఓవెన్‌ను మాటిమాటికీ తెరవద్దు. తెరిస్తే ఒక్కసారికే 25 డిగ్రీల వేడి వృథా అవుతుంది.
ఓవెన్‌లో ఎక్కువ పదార్థాలను వండవద్దు.
ఎలక్ట్రిక్ స్టౌలు వాడేప్పుడు నిర్ణీత సమయానికన్నా ముందే స్టౌ ఆఫ్ చేయాలి.
ఉపరితలం సమానంగా ఉన్న స్టౌల వల్ల వేడి అన్ని వైపులకూ సమంగా వ్యాపించి, త్వరగా వంట పూర్తడమే కాకుండా విద్యుత్ ఆదా అవుతుంది.
ఎలక్ట్రిక్ స్టౌలపైనా ప్రెషర్ కుక్కర్ వాడకం ద్వారా విద్యుత్ మరింత ఆదా అవుతుంది. కుక్కర్ గ్యాస్కెట్ లీడ్స్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

ఇంట్లో విద్యుత్ ఆదాచేయుట ఎలా?
ప్రతి సంవత్సరం గవర్నమెంట్ విద్యుత్ చార్జీలను పెంచుతూనే పోతుంది.దానికి తోడు క్రొత్త క్రొత్త విద్యుత్ పరికరాలు మన ఇంట్లో చేరుతూనే ఉన్నాయి. మన విద్యుత్ చార్జీలను తగ్గించి కోవటం తో పాటు పర్యావరణాన్ని రక్షించు కోవటానికి కొన్ని చిట్కాలు
దాని ద్వారా విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గించుకోవచ్చు .
2.టెలివిజన్ :మనకు టి .వి తో పాటు ఫ్యాన్ .లైట్స్ వేసుకోవటం అలవాటు . సాద్యమైనంతగా వెలుతురు గాలి ప్రదేశాలకు అనుకూలంగా ఉండే విధంగా టి .వి అమర్చుకోవాలి
3.ప్రిజ్ :.ప్రిజ్ ని గోడలకు ఆనకుండా ఒక అరడుగు దూరంగా ఏర్పాటు చేసుకోవాలి. ప్రిజ్ నుంచి వచ్చే వేడిగాలి బయటకు పోవటానికి ఆస్కారం కలుగుతుంది .కాలానికి అనుగుణంగా ప్రిజ్ లోని కూల్ మోడ్ మార్చుకోవాలి. కం టె నై ర్ ఖాళీగా ఉండేటట్టు చూసుకోవాలి . ప్రిజ్ తలుపులు ఎక్కువ సార్లు తెరవకుండా చూసుకోవాలి.
4.గీజర్ :ఎక్కువ సేపు ఆన్ లో లేకుండా స్నానానికి వెళ్లేముందు మాత్రం ఆన్ చేసుకుంటే విద్యుత్ ఆదా అవుతుంది అటో స్విచ్ కంటే డైరెక్ట్ గా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి .
6. ACs:మన ఇండియాలో ఎ.సి తక్కువ టెంపరేచర్ 18 డిగ్రీలు దగ్గర పెడతాము.దీనివల్ల మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది 24 డిగ్రీలు దగ్గర పెడితే విద్యుత్ ఆదా అవుతుంది
0 comments:
Post a Comment