SOLAR POWER INFORMATION (సోలార్ విద్యుత్ ఇంటికి అయ్యే ఖర్చుల వివరాలు)
Swach Bharat Swach Urja.
Make your rooftop solar, and earn power and money .
For details pls call 9963000447
హైదరాబాద్: ఇక మీ ఇంటి నుంచే కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలపై సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ వ్యవస్థ ఏర్పాటు మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇళ్లు, కార్యాలయం యజమానులు చేయాల్సింది* స్థానిక విద్యుత్ డివిజన్ ఇంజినీరు(డీఈఈ)ని కార్యాలయంలో సంప్రదించాలి.
* ఉత్పత్తి స్థాయిని బట్టి దరఖాస్తు రుసుం చెల్లించాలి.
* ఒకటి నుంచి ఆరు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సమార్థ్యం వాటికి రూ.1500లు చెల్లించాలి.
* ఆరు నుంచి 100 కిలోవాట్ల వరకు రూ.10వేలు చెల్లించాలి.
* వంద నుంచి ఒక కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 50 వేలు చెల్లించాలి.
* మనం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల లోపు విద్యుత్ సిబ్బంది మీ ఇళ్లు, కార్యాలయం ఫీల్డ్ చెకింగ్ చేయడం జరుగుతుంది.
* 21 రోజుల లోపల నెట్ మీటరింగ్ కనెక్షన్‌కు అవకాశం ఉందా, లేదా అన్న విషయం డిస్కం తెలియజేస్తుంది.
* డిస్కం అధికారులు అభ్యంతరం తెలపకుంటే దరఖాస్తు ఆమోదించినట్లుగా వినియోగదారులు పరిగణించాలి.
* కనెక్షన్‌కు ఎంత ఖర్చు అవుతుందన్న సంగతి డిస్కం అధికారులు తెలియజేస్తారు. డిస్కం అధికారులు ఎస్టిమేషన్ తెలిపిన 15 రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
* గరిష్ఠంగా ఒక కిలోవాట్‌కు మించి నెట్‌మీటరింగ్‌కు అనుమతించరు.
* 75 కిలోవాట్లకు మించి ఉత్పత్తి సమార్థ్యం కలిగి ఉంటే బీమా చేయించుకోవాలి. దీనికి స్థానిక విద్యుత్ ఇన్‌స్పక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి.
* 75 కిలోవాట్లకు మించి ఏర్పాటు చేస్తే హైటెన్షన్ లెన్లకు మాత్రమే అనుసందానం చేయాల్సి ఉంటుంది.
* ఇల్లు, భవనం, ఖాళీ స్థలంలోనూ సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. నేలకు 2.44 మీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
* వీటి వల్ల జరిగే ప్రమాదాలకు డిస్కం బాధ్యత వహించదు.
0 comments:
Post a Comment