విద్యుత్ సమాచారం online shopping http://vidyut1.blogspot.in/2016/07/on-line-marketing-links.html

Powered by Blogger.

నా గురించి విషయాలు

BTemplates.com

Blogroll

Friday, September 2, 2016

Getting electricity bill more?check it ! (కరెంట్ బిల్లు అధికంగా వస్తోందా?... ఒకసారి వీటిని చెక్ చేయండి!)



వినియోగంలో మార్పు లేదు. కానీ, నెల తిరిగేసరికి విద్యుత్ బిల్లు భారీగా పెరిగిపోతోంది...? నెల క్రితం వచ్చిన బిల్లు కంటే ప్రస్తుతం వచ్చిన బిల్లు ఎక్కువగా ఉంది...? ఏడాది క్రితంతో పోలిస్తే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉపకరణాలు ఏవీ పెరగలేదు. కానీ బిల్లు ఎందుకంత ఎక్కువగా వచ్చింది...? అయితే వీటిని ఓ సారి పరిశీలించాల్సిందే...
తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లు, అంతకు ముందు నెల బిల్లు... ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన బిల్లును ఓసారి బయటకు తీయండి. తాజా బిల్లులో ఎన్ని యూనిట్లు ఉన్నదీ పరిశీలించాలి. అంతకుముందు నెలల్లోనూ అన్నే యూనిట్ల వినియోగం ఉండి బిల్లు అమౌంట్ పెరిగిందంటే విద్యుత్ చార్జీలు పెరిగాయేమో చూసుకోవాలి. విద్యుత్ వినియోగ టారిఫ్ ను పెంచి ఉంటే కొత్త చార్జీల ప్రకారం లెక్కిస్తే తెలిసిపోతుంది. విద్యుత్ చార్జీలు పెరగకపోయినా బిల్లు మొత్తం పెరగడానికి సర్ చార్జీ, ఇతర చార్జీలు బిల్లులో వచ్చి చేరాయేమో పరిశీలించాలి.
స్నేహితుల ఇళ్లల్లో వినియోగం...
స్నేహితులు ఎంతో మంది ఉంటారు. మీ ఇంట్లో ఏఏ విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో ఓ సారి నోట్ చేసుకోండి. ఇప్పుడు అచ్చం అన్నే ఉపకరణాలు ఉన్న స్నేహితుల గురించి విచారించి... వారికి ఎంత బిల్లు వస్తుందో అడిగి తెలుసుకుంటే... సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది.
మీటర్ చెకింగ్
తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లులో వినియోగ యూనిట్లు, అంతకుముందు నెలల్లో ఉన్న వినియోగం కంటే పెరిగి ఉంటే... బిల్లు కాల వ్యవధిలో ఇంట్లో ఏవైనా వేడుకలు జరిగాయా, బంధువులు కొన్ని రోజులు ఇంట్లో ఉండి వెళ్లారా, వేసవి అయితే ఏసీ వాడకం పెరిగిందా ఇలాంటి అంశాలను ఓ సారి చెక్ చేసుకోవాలి. అయినా, మీ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎప్పటిలానే ఉంటే... మీటర్ రీడింగ్ నమోదులో పొరపాటు జరిగిందా లేక సమస్య మీటర్ లో ఉందేమో పరిశీలించి విషయాన్ని రూఢీ చేసుకోవాల్సి ఉంటుంది.  
మీటర్ రీడింగ్ సరిగానే ఉంటే...?
ఒకవేళ మీటర్ రీడింగ్ సరిగానే ఉందనుకుంటే... విద్యుత్ సరఫరా పరంగా ఎక్కడైన లీకేజీలు ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందు కోసం ముందుగా మెయిన్ ఆఫ్ చేయాలి. అప్పుడు కూడా మీటర్ తిరుగుతోందా...? అన్నది చెక్ చేయాలి. ఒకవేళ డిజిటల్ నంబర్ చూపించే మీటర్ అయితే... మెయిన్ ఆఫ్ చేసి ఉంచి రీడింగ్ నమోదు చేసి.... ఓ గంట రెండు గంటల తర్వాత తిరిగి రీడింగ్ చూడాలి. రీడింగ్ లో మార్పు ఉందా? గమనించాలి. మెయిన్ ఆఫ్ చేసి ఉంచినా మీటర్ రీడింగ్ పెరుగుతూనే ఉంటే సమస్య ఉన్నట్టు గుర్తించాలి.
మీటర్ పాడై అలా జరుగుతోందా...? లేక రహస్యంగా మీ మీటర్ కు వేరే వారి విద్యుత్ వైరు అనుసంధానమైందా? అన్నది ఎలక్ట్రీషియన్ సాయంతో తెలుసుకోవాలి. అలా వేరే ఏ ఇతర వైర్ కూడా మీ మీటర్ కు అనుసంధానమైనట్టు లేకపోతే సమస్య మరో చోట ఉన్నట్టే.
మెయిన్ ఆన్ చేసి... ఇప్పుడు ఒక్కో పరికరాన్ని మాత్రమే ఆన్ చేస్తూ రీడింగ్ సరిగ్గా ఉందేమో పరిశీలించాలి. ఒక కిలోవాట్ విద్యుత్ వినియోగంతో ఒక యూనిట్ మాత్రమే పెరగాలి. దీన్ని తెలుసుకోవాలంటే వన్ టన్ ఏసీ ఒక గంటపాటు ఆన్ చేసి ఉంచండి. ఒక యూనిట్ ఖర్చవుతుంది. లేదా 100 వాట్ల బల్బ్ ను 10 గంటల పాటు ఉంచినా ఒక యూనిట్ వ్యయం అవుతుంది. దాన్ని బట్టి మీటర్ రీడింగ్ సరిగ్గా ఉందో, లేదో తెలుస్తుంది.
మెయిన్ ఆఫ్ చేసినా, మరే ఇతర విద్యుత్ వైర్లు అనుసంధానం కాకపోయినా మీటర్ తిరుగుతూ ఉంటే సమస్య మీటర్ లో ఉందని అనుమానించవచ్చు. అప్పుడు విద్యుత్ విభాగానికి మీటర్ లో  సమస్య ఉన్నట్టు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారు ఆ మీటర్ ను మారుస్తారు. అధికంగా వసూలు చేసిన చార్జీలు వెనక్కి ఇవ్వాలని కోరితే మాత్రం మీటర్ ను టెస్టింగ్ కు పంపిస్తారు. టెస్టింగ్ చార్జీలను వినియోగదారుడే భరించాలి. పరీక్షల్లో మీటర్ లో సమస్య ఉందని నిర్ధారణ అయితే అధికంగా చెల్లించిన మొత్తాలను తర్వాతి బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు.  
వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలు....
అన్నీ సవ్యంగా ఉండి, విద్యుత్ వినియోగం అధికమై బిల్లు భారంగా మారితే... వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ట్యూబ్ లైట్లు, ఇన్ కాండిసెంట్ బల్బ్ ఉంటే వాటి స్థానంలో ఎల్ ఈ డీ బల్బులు అమర్చుకోండి. 10/10 గదికి 9, 10 వాట్ల ఎల్ ఈడీ బల్బ్ వెలుగు సరిపోతుంది. 12/12 రూమ్ అయితే, 14 వాట్ బల్బ్ చాలు. దాంతో 20 వాట్స్ కు పైన ఆదా అవుతుంది. ముఖ్యంగా బాత్ రూమ్, దేవుని మందిరాలలో లైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. వాటి స్థానంలో 1 లేదా 2 వాట్ల ఎల్ ఈడీ బల్బ్ లను అమర్చండి. గదుల్లో అవసరమైన ప్రదేశాల్లోనే లైటింగ్ పడేట్లు చూసుకోవడం వల్ల అవసరం లేని చోట బల్బ్ లను ఆఫ్ చేసుకోవడానికి వీలుంటుంది.
సీలింగ్ ఫ్యాన్లు 40, 50 వాట్లవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత ఫ్యాన్ల స్థానంలో వాటిని వాడుకోవడం వల్ల ఎంతో ఆదా అవుతుంది. మామూలు లోకల్ బ్రాండ్ ఫ్యాన్లు 90 వాట్ల వరకు విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అదే బ్రాండెడ్ లో రేటింగ్ లేనివి అయితే75 వాట్ల వరకు విద్యుత్ ను ఖర్చు చేస్తాయి. ఏ ఇంట్లో అయినా ఎప్పుడూ వినియోగంలో ఉండే పరికరాలు ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ లు. అందుకే 5 స్టార్ రేటింగ్ ఉన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడుకోవడం వల్ల వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైగా ఫ్రిడ్జ్ లను వేడి తగిలే చోట కాకుండా, గోడ నుంచి కనీసం నాలుగైదు అంగుళాల దూరంలో ఉంచడ వల్ల వినియోగం తగ్గుతుంది.  
1 టన్ ఏసీ 25 డిగ్రీల కంటే ఎక్కువలో సెట్ చేసుకోవడం వల్ల వినియోగం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు 1 టన్ను ఏసీ గంటకు ఒక యూనిట్ ఖర్చు చేస్తుందనుకుంటే.... అదే ఇన్వర్టర్ టెక్నాలజీతో ఉన్న ఏసీని వాడడం వల్ల 0.60యూనిట్ వరకే విద్యుత్ ఖర్చు అవుతుంది. అత్యవసర సమయాల్లో ఇంట్లో ఐరన్ చేసుకుంటే చేసుకున్నారు, కానీ మిగిలిన సమయాల్లో బయట చేయించుకోవడం నయం. ఎందుకంటే మొత్తం మీద యూనిట్లు పెరిగిపోతే శ్లాబ్ రేట్ మారిపోయి బిల్లు భారంగా మారుతుందని గుర్తించాలి. మరీ ముఖ్యంగా కొనే ఏ ఎలక్ట్రిక్ ఉపకరణం అయినా 5 స్టార్ రేటింగ్ లో ఉండి వినియోగం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 
ఇక స్విచాఫ్ చేసినా కూడా కొన్ని రకాల పరికరాలు విద్యుత్ వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఓవెన్ ఉంటుంది. అందులో ఆహారం పెట్టినప్పుడే ఆన్ అవుతుంది. కానీ, ఆన్ అయ్యేందుకు సిద్ధంగా ఉండేందుకు దానికి కొంత విద్యుత్ ఖర్చు అవుతుంది. కంప్యూటర్లు, టీవీలు, డీవీఆర్ లు వీటిల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకే వీటిని వాడేందుకు ఓ మార్గం ఉంది. ప్లగ్ సాకెట్లతో ఉండే పవర్ స్ట్రిప్ తెలిసే ఉంటుంది. ఎక్కువగా కంప్యూటర్, సీపీయూలను అనుసంధానించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈ స్ట్రిప్ కు ఉపకరణాలను అటాచ్ చేయండి. వాడే అవసరం లేనప్పుడు మెయిన్ ప్లగ్ సాకెట్ లో, పవర్ స్ట్రిప్ వద్ద కూడా ఆఫ్ చేయడం వల్ల దుర్వినియోగం ఉండదు. 
డిష్ వాషర్లు, క్లాత్ వాషింగ్ మెషిన్లు బాగా విద్యుత్ ను వాడేస్తాయి. అందుకే రెండు మూడు వస్త్రాలను వాషింగ్  మెషిన్ లో వేసి ఆన్ చేయకండి. తక్కువ వస్త్రాలుంటే వారానికి ఒకసారి లేదా రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే పూర్తి లోడ్ వరకు వస్త్రాలు వేసి వాషింగ్ మెషిన్ ను ఉపయోగించాలి. అలాగే వంట పాత్రలను కూడా పూర్తి లోడ్ మేరకు వేసి వినియోగించుకోవడం వల్ల దుర్వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
పాత వాటితో ఇబ్బందే
మరీ ఎన్నో ఏళ్ల క్రితం కొన్న విద్యుత్ ఉపకరణాలు వాడడం వల్ల కూడా బిల్లు పెరిగిపోతుంది. అందుకే వాటి కాలపరిమితి దాటిందనుకుంటే మార్చివేయడం మంచిది. ఉదాహరణకు సీలింగ్ ఫ్యాన్ అయితే ఎనిమిదేళ్ల తర్వాత వాడకపోవడం ఉత్తమం. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ఉన్న సీలింగ్ ఫ్యాన్ 90 వాట్లకు పైగా విద్యుత్ ను వాడుకుంటుందని పరీక్షల్లో తేలింది.http://vidyut1.blogspot.in/2016/07/on-line-marketing-links.html

Thursday, September 1, 2016

MUTUAL FUNDS INFORMATION (మ్యూచువల్ ఫండ్ )


నెలకు కేవలం వెయ్యి రూపాయల పొదుపుతో కోటి రూపాయల సంపదకు యజమాని అయ్యే అవకాశం కేవలం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వల్లే సాధ్యం. 20 ఏళ్ల వయసు నుంచి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 60 ఏళ్ల వరకు పొదుపు చేస్తూ వెళితే... సగటున 12 శాతం వార్షిక వృద్ధి అంచనా ప్రకారం సమకూరే నిధి 1,17,64,773 రూపాయలు. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు తప్పక చోటు ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఎన్నో రకాలు ఉన్నట్టే... వాటి కొనుగోలుకు ఎన్నో మార్గాలున్నాయి. అందుకే ఇన్వెస్ట్ మెంట్ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. 

మ్యూచువల్ ఫండ్  ఏమిటి? మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌కి ఉదాహారణ: మ్యూచువల్ ఫండ్స్‌ గురించి అర్ధం అయ్యేందుకు మీకు ఒక ఉదాహరణ వివరిస్తాను. సూపర్ రిటర్న్స్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సూపర్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ అనే పధకాన్ని ప్రవేశపెట్టింది అనుకుందాం. ఈ పధకం క్రింద సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ స్కీమ్ ఉంది. స్టాక్ మార్కెట్ల నుంచి ఈ స్కీమ్ క్రింద వివిధ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ. 100కోట్లు సేకరించింది. ఈ స్కీమ్ గనుక ఈక్విటీ స్కీమ్ ఐతే షేర్లలో ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అదే రుణ స్కీమ్ ఐతే ఈ డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్లలలో మదుపు చేస్తారు. ఈ ఫండ్ మొదట్లో ఒక యూనిట్‌ను రూ. 10కి ఇచ్చిందని అనుకుందాం. ఒక్కో యూనిట్‌కు గాను రూ. 10 కాబట్టి మొత్తంగా రూ. 10,000 చెల్లించి 1000 యూనిట్లను కొనుగోలు చేశారు. ఒక్క సంవత్సరం తర్వాత సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు చేరింది. ఈ సమయంలో మీరు మీ యూనిట్స్‌ను తిరిగి మ్యూచవల్ ఫండ్స్‌కు అమ్మినట్లైతే, మీరు కొనుగోలు చేసిన 1000 యూనిట్లకు గాను మీరు రూ. 12,000 పొందుతారు. కొత్త యూనిట్లను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారుకి దీని వల్ల ఉపయోగం ఏంటీ? కొత్తగా యూనిట్లను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారుడు రూ. 12 చెల్లించి యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు మించి పెరిగితే ఆ సమయంలో మీరు మీ యూనిట్లను అమ్ముకోవచ్చు. దీంతో మీరు ఎక్కువ డబ్బును పొందగలుగుతారు. మ్యూచువల్ పంఢ్స్ వల్ల లాభాలు: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వుంటాయి.
 1. ఈక్విటీ ఫండ్స్ ఈక్వీటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారుల నుంచి డబ్బుని సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. ఈ ఫండ్స్ వల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్.

 2. డెట్ ఫండ్స్ డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్ డెట్, బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీమ్‌లలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అంటారు. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.

 3. బ్యాలె‌న్స్‌డ్ ఫండ్స్ మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీల్లో పెట్టుబడులు చేయడానికి విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆరునెలలు లేదా సంవత్సరం పాటు చిన్న మొత్తంతో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది. ఐదేళ్ళ కాలానికైతే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కంటే లార్జ్‌క్యాప్ ఫండ్స్ అనువైనవి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధికమించి రాబడులను అందించేది ఈక్విటీలు మాత్రమే. 

4. మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌కు మరో పేరు లిక్విడ్ ఫండ్స్. డిపాజిట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ అంటారు. ఈ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబుడులు పెడతారు. 5 గిల్ట్ ఫండ్స్ గిల్ట్ ఫండ్స్ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే ఫండ్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో పెద్ద మొత్తంలో డబ్బుని మదుపు చేస్తారు. ఈ డబ్బుని బ్యాంకింగ్ రంగంలో మదుపు చేయడం వల్ల మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్స్ ప్లాన్స్ మధ్య ఉన్న తేడా
ఆన్ లైన్ లో ఏఎంసీ వెబ్ సైట్లు, ఎంఎఫ్ యుటిలిటీ, మరి కొన్ని వేదికల్లో మాత్రమే డైరెక్ట్ ప్లాన్స్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మిగతా  తటస్థ వేదికల ద్వారా అయినా కొనుగోలు చేసేవి రెగ్యులర్ ప్లాన్స్ కిందకే వస్తాయి. పెట్టుబడి దారులకు డైరెక్ట్ ప్లాన్స్ అందించాలని 2012లో సెబీ ఆదేశించింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ పథకం నిర్వహణ కోసం ఏఎంసీలకు కొంత వ్యయం అవుతుంది. ఓ పథకానికి ఫండ్ మేనేజర్ల దగ్గర నుంచి ఎంతో మంది పనిచేసే వారు ఉంటారు. వారికి వేతనాల రూపంలో అయ్యే ఖర్చులు, కంపెనీ లాభాలు, డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంటు కమీషన్ చెల్లింపు ఇవన్నీ కలిపి నిర్ణీత శాతాన్ని ఎక్స్ పెన్స్ రేషియోగా పేర్కొంటారు. 
డైరెక్ట్ ప్లాన్స్ లో డిస్ట్రిబ్యూటర్లు లేదా ఏజెంట్లకు కమీషన్ చెల్లించే పని ఉండదు. రెగ్యులర్ ప్లాన్స్ లో కమీషన్ ఖర్చులు ఉంటాయి. దీంతో పథకాన్ని బట్టి వీటి మధ్య ఎక్స్ పెన్స్ రేషియో మారుతుంటుంది. ఉదాహరణకు హెచ్ డీఎఫ్ సీ టాప్ 200 పథకాన్ని తీసుకుంటే 2016 ఏప్రిల్ 30 నాటికి డైరెక్ట్ ప్లాన్ ఎక్స్ పెన్స్ రేషియో 1.64 శాతం కాగా, రెగ్యులర్ ప్లాన్స్ ఎక్స్ పెన్స్ రేషియో 2.25 శాతం.  0.61శాతం తేడా కనిపిస్తోంది. ఈ స్వల్ప శాతమే 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల కాలంలో పెట్టుబడులపై రాబడుల విషయంలో తేడా చూపెడుతుంది.
ఉదాహరణకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు ఓ పథకంలో రవి, కిరణ్ పదేళ్ల పాటు పెట్టుబడి పెట్టారనుకుందాం. ఒకరు డైరెక్ట్ ప్లాన్ అయితే, మరొకరు రెగ్యులర్ ప్లాన్ ఎంచుకున్నారు. ఎక్స్ పెన్స్ రేషియో .50 శాతం తేడా ఉంది. పదేళ్ల పాటు పెట్టుబడి పెడితే రెగ్యులర్ ప్లాన్ లో 9,40,969 రూపాయలు కాగా, డైరెక్ట్ ప్లాన్ లో 10,55,096 అయింది. పదేళ్లలో 1,15,000 తేడా కనిపిస్తోంది కదా. ఇదే 20 ఏళ్ల పాటు అయితే, తేడా రూ.5 లక్షలు, 30 ఏళ్ల పాటు అయితే 16 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ఇంత మేర రెగ్యులర్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఈక్విటీ ఆధారిత పథకాల్లోనే ఇంత మేర తేడా ఉంటుంది. అదే బ్యాలన్స్ ఫండ్స్ లో ఈ ఎక్స్ పెన్స్ రేషియో తేడా తక్కువగా, డెట్ ఫండ్స్ లో ఇంకా తక్కువగా ఉంటుంది. 
ఎన్ఏవీ నిర్ణయించేది ఎలా
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు యూనిట్ల రూపంలో ఉంటాయి. ప్రతీ యూనిట్ కు నెట్ అస్సెట్ వేల్యూ (ఎన్ఏవీ) కేటాయిస్తారు. ఇది ఎలా అంటే ఉదాహరణకు మీరు ఓ పథకంలో 5వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. ఆ పథకం యూనిట్ ఎన్ఏవీ కొనుగోలు తేదీన 20 రూపాయలు ఉందనుకోండి. అప్పుడు 5వేల రూపాయలకు 250 యూనిట్లు వస్తాయి. యూనిట్ విలువ ప్రతీ రోజూ మారుతుంటుంది. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ఎన్ఏవీలో మార్పులు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఓ పథకం కింద ఏఎంసీకి 2వేల కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి. వాటిని భిన్న రకాలుగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. వాటిని యూనిట్లుగా విభజిస్తారు కనుక ప్రతీ రోజు పెట్టుబడుల విలువను, యూనిట్లతో లెక్కించి ఎన్ఏవీని నిర్ణయిస్తుంటారు.

ఓ పథకం కింద 2వేల కోట్లు రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. అప్పుడు ఆ ఫండ్ ఎన్ఏవీ 2వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ మొత్తాన్ని యూనిట్లతో భాగించగా అప్పుడు ఒక్కో యూనిట్ ఎన్ఏవీ ఎంతో తెలుస్తుంది. ఓ పథకం ప్రారంభంలో 100 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చాయనుకోండి. 10 రూపాయల ముఖ విలువతో ఫండ్ హౌస్ యూనిట్లను కేటాయిస్తుంది. తర్వాత కాలంలో ఆ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతూ దానికనుగుణంగా యూనిట్ ఎన్ఏవీ కూడా పెరుగుతూ వెళుతుంది. తర్వాత కాలంలో కొనుగోలు చేసే ఇన్వెస్టర్లకు 10 రూపాయల ముఖ విలువ ఉన్న యూనిట్ ను మార్కెట్ ధర ప్రకారం కేటాయిస్తారు. 
కొనుగోలుకు వర్తించే ఎన్ఏవీ
లిక్విడ్ ఫండ్స్ ఎన్ఏవీని సెలవు రోజుల్లో (ఆదివారం) ప్రకటిస్తుంటారు. ఇలా సెలవు రోజుల్లో ప్రకటించిన ఎన్ఏవీ ధరే తదుపరి సెలవు రోజు కొత్త ఎన్ఏవీ ప్రకటించే వరకు అమల్లో ఉంటుంది. ఉదాహరణకు సోమవారం మధ్యాహ్నం 2లోపు లావాదేవీకి సంబంధించిన రిక్వెస్ట్ అందితే, ఫండ్ హౌస్ వద్ద దరఖాస్తు దారుడి కొనుగోలు విలువకు సరిపడా నిధులు ఉంటే అంతకుముందు రోజు ఎన్ఏవీ ధర ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లావాదేవీ అయితే అదే రోజు ముగింపు ధర ప్రకారం మరుసటి రోజు యూనిట్లు కేటాయిస్తారు. 
అదే లిక్విడ్ ఫండ్స్ ఉపసంహరణకు సంబంధించిన డెడ్ లైన్ మధ్యాహ్నం 3 గంటలు. ఆ లోపు వచ్చిన దరఖాస్తుదారులకు ఆ రోజు ముగింపు ధర ప్రకారం మర్నాడు యూనిట్లు విక్రయించి నగదు చెల్లింపులు చేస్తారు. అదే ఈక్విటీ ఇతర ఫండ్ల విషయంలో... మధ్యాహ్నం మూడు గంటల లోపు కొనుగోలు, విక్రయం (ఉపసంహరణ) కోసం వచ్చిన దరఖాస్తులకు అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుంది. మూడు గంటల తర్వాత అందే దరఖాస్తులకు మర్నాడు ఎన్ఏవీ వర్తిస్తుంది. 
రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కిందకు మార్చుకోవచ్చా...?
ఏఎంసీని సంప్రదించి నిర్ణీత ఫారమ్ ను సమర్పించి రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కిందకు మార్చుకోవచ్చు. అయితే, ఎగ్జిట్ చార్జీలు భరించాల్సి ఉంటుంది. పన్ను పరంగా ప్రయోజనాలు ఉంటే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కింద మార్చాలంటే ఆ యూనిట్లను విక్రయించి తిరిగి డైరెక్ట్ ప్లాన్స్ కింద యూనిట్లను కొనుగోలు చేస్తారు. అయితే, రెగ్యులర్ ప్లాన్స్ కింద పెట్టుబడి పెట్టి ఏడాది దాటితే ఎలాంటి ఉపసంహరణ చార్జీలు ఉండవు. ఒకవేళ ఏడాదిలోపే అయితే, వాటిని ఉపసంహరించుకోకుండా అలా ఉంచి... డైరెక్ట్ ప్లాన్స్ లో  ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్లాన్ కింద పెట్టుబడులు ఏడాది పూర్తయిన తర్వాత డైరెక్ట్ ప్లాన్ కిందకు ఎలాంటి చార్జీలు లేకుండా మార్చుకోవచ్చు. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మినహా మరే ఇతర ఫండ్స్ ను అయినా మార్చుకోవచ్చు.
చార్జీలు
మ్యూచువల్ ఫండ్స్  యూనిట్ల కొనుగోలుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఏడాదిలోపు ఉపసంహరించుకున్న సందర్భాల్లోనే నిర్ణీత చార్జీలు విధిస్తారు. ఈ చార్జీలు ఆరు నెలలలోపు అయితే 2శాతం, ఆ తర్వాత నుంచి ఏడాది లోపు 1 శాతం మేర ఉంటాయి.

మంచి పథకాలను ఎంచుకునే విధానం
దేశంలో సుమారు 44కుపైగా అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవి పది వేలకు పైగా పథకాలను నిర్వహిస్తున్నాయి. 2016 మార్చి నాటికి ఏఎంసీల నిర్వహణలో ఉన్న ఇన్వెస్టర్ల నిధులు సుమారుగా 14 లక్షల కోట్లు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న పథకాల్లో మంచి వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తేనే అధిక ప్రతిఫలం అందుకోవడం సాధ్యమవుతుంది. 
ఒక మంచి పథకాన్ని ఎంచుకోవడానికి గణాంకాలే ప్రామాణికం. పనితీరులో ఉత్తమంగా ఉన్న స్కీమ్స్ గురించి వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గత ఐదు పదేళ్ల కాలంలో ఆ ఫండ్ పనితీరు ఎలా ఉందన్నది చూడాలి. ఎంత శాతం సగటున వార్షిక ప్రతిఫలాన్ని అందించిందన్నది ముఖ్యం. కొత్త పథకమైతే మూడేళ్ల పనితీరును ప్రామాణికంగా తీసుకోవాలి. మొదటి క్వార్టయిల్ ర్యాకింగ్ లో ఉన్న ఫండ్స్ పనితీరులో ఉత్తమమైనవి. పనితీరులో దారుణంగా ఉన్నవి నాలుగో క్వార్టయిల్ ర్యాంకింగ్ లో ఉంటాయి. 
క్వార్టయిల్ ర్యాకింగ్ అనేది వివిధ పారా మీటర్ల (పథకంలో ఉండే రిస్క్, ఎక్స్ పెన్స్ రేషియో వంటివి) ఆధారంగా పథకాన్ని మదింపు వేసి పెట్టుబడుల పరంగా దానికి ర్యాంక్ ఇచ్చే విధానం. ఉదాహరణకు ఓ పథకం మూడేళ్లు పూర్తి చేసుకుంటే దాని విషయంలో మూడేళ్ల కాలాన్ని తొమ్మిది నెలల చొప్పున నాలుగు భాగాలు చేసి విశ్లేషించి ర్యాకింగ్ ఇస్తారు. 
ప్రతీ ఫండ్ హౌస్ వెబ్ సైట్ కు వెళితే ప్రతీ పథకం సమాచారం లభిస్తుంది. పనితీరు వివరాలు, పోర్ట్ ఫోలియో ... అంటే ఏ ఏ కంపెనీ షేర్లలో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయో తెలుస్తుంది. ఫండ్ మేనేజర్ వివరాలు ఉంటాయి. ఎక్స్ పెన్స్, టర్నోవర్ రేషియో వివరాలు తెలుస్తాయి. వీటి ఆధారంగా కూడా ఓ నిర్ణయానికి రావచ్చు. 
ఒకరు ఓ పథకాన్ని ఎంచుకునే ముందు తప్పకుండా చూడాల్సినది  ఎక్స్ పెన్స్ రేషియో. ఉదాహరణకు నెల నెల రెండు పథకాల్లో వెయ్యి రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందు మంచి రాబడుల చరిత్ర ఉన్న నాలుగు పథకాలను ఎంపిక చేసుకోండి. అప్పుడు వాటి డైరెక్ట్ ప్లాన్స్ లేదా రెగ్యులర్ ప్లాన్స్ ఎక్స్ పెన్స్ రేషియోను పరిశీలించండి. ఎక్స్ పెన్స్ రేషియో తక్కువగా ఉన్నది ఎంపిక చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో రాబడుల్లో పైన చెప్పుకున్నట్టే గణనీయమైన తేడా కనిపిస్తుంది.
ఓ పథకం కింద పెట్టుబడుల నిర్వహణ, రాబడులు ఫండ్ మేనేజర్ శక్తి, సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే పథకంలో పెట్టుబడి పెట్టేముందు సదరు మేనేజర్ ట్రాక్ రికార్డును పరిశీలించాలి. సదరు మేనేజర్ గతంలో నిర్వహించిన పథకాలు, పనితీరు, ఆ మేనేజర్ నిర్వహణలో ఉన్న మొత్తం పథకాలను చూడాల్సి ఉంటుంది. 
ఫండ్స్ రకాలు
ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్, ఇంటర్వల్ అని వైవిధ్యంతో కూడిన ఫండ్ పథకాలు ఉన్నాయి.
1.డెట్/ఇన్ కమ్
ఫండ్ నిధుల్లో అధిక మొత్తాన్ని డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలతో పెట్టుబడి పెడతారు. ఈక్విటీ పథకాలతో పోలిస్తే ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అంటే రిస్క్ తక్కువ, ప్రతిఫలం తక్కువ అనే తీరులో వీటి పనితీరు ఉంటుంది. పెద్దగా రిస్క్ తీసుకోలేని వారికి, స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇవి అనువైనవి.
2. మనీ మార్కెట్/లిక్విడ్
స్వల్ప కాలానికి అంటే కేవలం నెలల వ్యవధి కోసం అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవచ్చు. పైగా చెప్పుకోదగ్గ వడ్డీ గిట్టుబాటవుతుంది. స్వల్ప కాలిక డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రతిఫలాలను అందిస్తాయి. ఏదైనా అవసరం కోసమో లేక మంచి పెట్టుబడి అవకాశం కోసమే నగదును సిద్ధం చేసుకున్న తర్వాత కొంత సమయం ఉందనుకోండి. ఆ నగదును సేవింగ్స్ ఖాతాలో అట్టి పెట్టుకోవడం కంటే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. 8 శాతం వరకు ప్రతిఫలాన్నిస్తాయి.