విద్యుత్ సమాచారం online shopping http://vidyut1.blogspot.in/2016/07/on-line-marketing-links.html

Powered by Blogger.

నా గురించి విషయాలు

BTemplates.com

Blogroll

Wednesday, December 13, 2017

యాప్స్ తో ప్రభుత్వ సేవలు


ఇప్పుడంతా డిజిటల్. కేంద్రంలో మోదీ సర్కారు కొలువు తీరిన తర్వాత మన దేశంలో ప్రభుత్వ సేవలు వేగంగా డిజిటల్ మయం అయిపోతున్నాయి. ఎన్నో యాప్స్ మన ముందుకు వచ్చి పడుతున్నాయి. వీటిలో ఉపయోగకరమైనవీ కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే కథనమే ఇది.

నరేంద్రమోదీ యాప్representational imageప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక యాప్ ఇది. ప్రధానమంత్రి రోజువారీ కార్యకలాపాల సమాచారం ఈ యాప్ నుంచి తెలుసుకోవచ్చు. ప్రధాన మంత్రి నుంచి నేరుగా సందేశాలు, ఈ మెయిల్స్ ను అందుకునే యూనిక్ ఆప్షన్ కూడా యాప్ లో ఉంది. తన ఐడియాలను ప్రజలతో పంచుకునే ఉద్దేశంతో ప్రధాని ఈ యాప్ ను తీసుకొచ్చారు. ఈ యాప్ నుంచి ప్రధాన మంత్రి మన్ కీ బాత్ లో ఏ ఎపిసోడ్ అయినా వినొచ్చు. ప్రధాని బ్లాగులను చదువుకోవడం, బయోగ్రఫీ సెక్షన్ లో ప్రధాని జీవితం గురించి ఎన్నో వివరాలు  తెలుసుకునే సదుపాయలూ ఉన్నాయి. యాండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

భీమ్ యాప్representational imageడిజిటల్ చెల్లింపుల కోసం తీసుకొచ్చిందే భీమ్ యాప్. భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (బీహెచ్ఐఎం) దీని పూర్తి నామం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేస్తుంది. మొబైల్ ఫోన్లో ఈ యాప్ ఉంటే క్షణాల్లో లావాదేవీల చెల్లింపులు, నగదు బదిలీలు చేసుకోవచ్చు. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు వెళతాయి. యాప్ లోకి లోడ్ చేసుకుని చెల్లించాల్సిన అవసరం ఇందులో లేదు. యూపీఐ అడ్రస్ లేదా మొబైల్ నంబర్, లేదా క్యూఆర్ కోడ్ ఏది ఉంటే దానితోనే యూజర్లు నగదు చెల్లించడం, స్వీకరించడం చేసుకోవచ్చు. యూపీఐ ప్లాట్ ఫామ్ పై అందుబాటులో ఉన్న అన్ని బ్యాంకుల ఖాతాదారులు భీమ్ యాప్ తో కనెక్ట్ అయిపోవచ్చు.

ఎంపాస్ పోర్ట్ సేవా యాప్representational imageపాస్ పోర్ట్ సేవలు పొందేందుకు ఉద్దేశించినదే ఈ యాప్. అంతేకాదు, పాస్ పోర్ట్ కార్యాలయం అందిస్తున్న అన్ని సేవల వివరాలూ పొందొచ్చు. పాస్ పోర్ట్ కు సంబంధించి ఎన్నో రకాల సేవలను ఈ యాప్ ద్వారా విదేశాంగ శాఖ అందిస్తోంది. సమీపంలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్ కే) లేదా జిల్లా పాస్ పోర్ట్ సెల్స్ (డీపీసీ) సమాచారాన్ని యాప్ నుంచి తెలుసుకోవచ్చు. లేదా మీరుండే పిన్ కోడ్ సాయంతో సమీపంలోని కేంద్రం గురించి తెలుసుకోవచ్చు. పోలీసు స్టేషన్ల వివరాల కోసం సెర్చ్ చేయవచ్చు. అప్లికేషన్ తో పాటు చెల్లించాల్సిన ఫీజుల సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. కొత్తగా పాస్ పోర్ట్ కోసం లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే డేటాఫ్ బర్త్, ఫైల్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చు. పాస్ పోర్ట్ పొందాలంటే అందుకు అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం తదితర సమస్త సమాచారం ఈ యాప్ అందిస్తుంది.

ఎంకవచ్ (M-KAVACH)representational imageఇది మొబైల్ సెక్యూరిటీ యాప్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలో గల సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీడాక్) దీన్ని ఆవిష్కరించింది. మాల్వేర్ దాడులు, హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మీరు వాడుతున్న వైఫై, బ్లూటూత్, కెమెరాలను మరొకరు దుర్వినియోగం చేయకుండా చూసుకుంటుంది. మీ ఫోన్ పోతే అందులో సిమ్ వేరొకరు మార్చిన వెంటనే ఆ సమాచారం మీకు తెలిసిపోతుంది. ఎవరి చేతిలోనైనా మీ మొబైల్ పడితే అందులో డేటాను రిమోట్ సాయంతో డిలీట్ చేసేయవచ్చు. మీరు పోగొట్టుకున్న ఫోన్ ను రీసెట్ చేయవచ్చు. డేటాను ఫోన్ తో పాటు, రిమోటర్ సర్వర్ లోనూ బ్యాకప్ చేసుకుని రీస్టోర్ చేసుకునేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. యాండ్రాయిడ్ ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓటర్ సర్వీసెస్ఈ యాప్ ద్వారా ప్రజలు ఎలక్టోరల్ రోల్ లో తమ పేరును సరి చూసుకోవచ్చు. కొత్త ఓటర్ ఐడీ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు కార్డులో మార్పులు చేర్పులతోపాటు ఓటరు జాబితా నుంచి తమ పేరును తొలగించుకో్వచ్చు.  

కిసాన్ సువిధrepresentational imageరైతులకు ఉద్దేశించి యాప్ ఇది. రైతులకు సమాచారాన్ని వేగంగా అందించేందుకు తీసుకొచ్చారు. తామున్న ప్రాంతంలో ప్రస్తుత వాతావరణం, రానున్న ఐదు రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది, సాగు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సమీపంలోని కమోడిటీల మార్కెట్ ధరలు, సంబంధిత పంటకు రాష్ట్రంలోఉన్న గరిష్ట ధరలు తెలుసుకోవచ్చు.

ఉమంగ్కేంద్ర సర్కారు ఇటీవలే ‘యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూఏజ్ గవర్నెన్స్ (ఉమంగ్) పేరుతో భిన్న రకాల సేవల కోసం యాప్ ను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మున్సిపాలిటీల సేవలనూ దీని సాయంతో పొందొచ్చు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో), ఎన్ పీఎస్, పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన మైపాన్, పెన్షనర్లకు ఉద్దేశించిన డిజిలాకర్, ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన డిజి సేవక్ ఇలా 100 రకాల ప్రభుత్వ సేవలను ఉమంగ్ వేదికగా పొందొచ్చు.  

ఖోయ, పాయ యాప్ (Khoya Paya)representational imageఇది సామాజిక సేవా దృక్పథంతో కూడిన యాప్. తప్పిపోయిన చిన్నారుల వివరాలు ఈ యాప్ వేదికగా పంచుకోవచ్చు. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తమ పేరు ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత తమకు తెలిసి తప్పిపోయిన చిన్నారుల వివరాలను పోస్ట్ చేయవచ్చు. దాంతో ఆ వివరాలు ఈ యాప్ వేదికగా అందిరికీ తెలిసిపోతాయి. దీంతో చిన్నారులను గుర్తించే ప్రక్రియ సులభమవుతుంది. ఇదే యాప్ లో ఎంత మంది చిన్నారులు తప్పిపోయారు, ఎంత మంది ఆచూకీ లభించిందన్న వివరాలూ ఉంటాయి. ఆచూకీ లభించిన వారి వివరాల ఆధారంగా తమ వారిని గుర్తించే అవకాశం ఉంటుంది. తప్పిపోయిన పిల్లల వివరాల్ని అందరికీ తక్కువ సమయంలోనే తెలియజేసేందుకు వీలు కల్పించే వేదిక ఇది.

సీబీఈసీ జీఎస్టీ (CBEC GST)వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త పన్ను చట్టానికి మారడం ఎలా, జీఎస్టీ నిబంధనలు, చట్టం ఇతర పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జీఎస్టీకి సంబంధించి తాజాగా చేసిన మార్పులు, చేర్పుల సమాచారం కూడా లభిస్తుంది. సీబీఈసీ హెల్ప్ డెస్క్ ను ఈ యాప్ నుంచే సంప్రదించొచ్చు.

పోస్ట్ ఇన్ఫో యాప్representational imageపోస్టల్ సేవలను కస్టమర్ ఫ్రెండ్లీగా మార్చే చర్యల్లో భాగంగా వచ్చిందే పోస్ట్ ఇన్ఫో యాప్. ఈ యాప్ నుంచి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్, రిజిస్టర్డ్ పార్సిల్, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ సమాచారాన్ని ట్రాక్ చేసుకునే ఆప్షన్ ఉంది. పార్సిల్, లెటర్లు ఇలా పోస్టల్ సేవలకు సంబంధించి చార్జీలను తెలుసుకునేందుకు క్యాలిక్యులేటర్ ఉంది. సమీపంలోని పోస్టాఫీసు లొకేషన్ తెలుసుకోవచ్చు. పోస్టాఫీసు చిరునామా, సంప్రదించాల్సిన వ్యక్తి ఫోన్ నంబర్ల సమాచారం కూడా ఉంటుంది. పొదుపు పథకాల వడ్డీ రేట్ల సమాచారం కూడా తెలుసుకోవచ్చు.

ఆయ్ కర్ సేతు (AAYKAR SETU)ఆదాయపన్నుకు సంబంధించి మనలో చాలా మందికి ఎన్నో సందేహాలుంటాయి. దాంతో పన్ను రిటర్నుల జ ోలికి వెళ్లే సాహసం కూడా చేయనివారున్నారు. అయితే, ఈ తరహా వ్యక్తులకు ఆయ్ కర్ సేతు యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పన్నుకు సంబంధించి సందేహాలను తీర్చుకోవచ్చు. లైవ్ చాట్ సదుపాయం ఉంది. ఆదాయపన్నుకు సంబంధించి ఇతర సేవల సమాచారాన్ని కూడా పొందొచ్చు. పన్ను రిటర్నులు, ఎంత పన్ను చెల్లించాలో తెలిపే కాలిక్యులేటర్లు కూడా ఉన్నాయి.

ఎంఈఏ ఇండియాrepresentational imageఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫైర్స్ (విదేశాంగ శాఖ) అధికారిక యాప్. విదేశాంగ శాఖ పరిధిలో అన్ని సేవల సమాచారం ఈ యాప్ లో ఉంది. ఈ సిటిజన్, పాస్ పోర్టులు, వీసాలు, ఇండియన్ ఎంబసీలు, హై కమిషన్ల సమాచారం ఉంటుంది. శాఖ తరఫున మీడియా ప్రకటనలు కూడా చూడొచ్చు.

పీఎంఓ ఇండియా మొబైల్ యాప్ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. ఇక్కడ పలు అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది.

హెచ్ పీ గ్యాస్ బుకింగ్గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేదుకు, రీఫిల్ హిస్టరీ చూసుకునేందుకు, ఎల్పీజీ కనెక్షన్ ను సరెండర్ చేసేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ అనువుగా ఉంటుంది. హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు దీన్ని లౌడ్ చేసుకోవడం ద్వారా సేవల్ని సులభంగా పొందడానికి వీలవుతుంది.

ట్రాయ్ మై స్పీడ్representational imageటెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన యాప్ మై స్పీడ్. మొబైల్ డేటా వినియోగదారులు తాము వినియోగిస్తున్న డేటా స్పీడ్ ఎంతన్నది రియల్ టైమ్ తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. యూజర్లు ఈ సమచారాన్ని ట్రాయ్ కు చేరవేయక్కర్లేదు. డేటా స్పీడ్ ఎంతుంది, నెట్ వర్క్ సమాచారం, మొబైల్ ఫోన్ ఏ ప్రాంతంలో ఉంది తదితర సమాచారం ఈ యాప్ ద్వారా ట్రాయ్ కు చేరుతుంది. దాంతో ట్రాయ్ ఆ వివరాలను బహిరంగ పరుస్తుంది.

మీ సేవ యాప్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలు స్మార్ట్ ఫోన్ నుంచే పొందేందుకు గాను మీ సేవ యాప్ ను ఆవిష్కరించింది. ఇది పౌర సేవల యాప్. దాదాపు చాలా రకాల ప్రభుత్వ సేవలు దీని ద్వారా పొందొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లులు, వాటర్, గ్యాస్ బిల్లులు, పన్నుల చెల్లింపులు, బ్యాంకింగ్, వ్యవసాయం, పాస్ పోర్ట్ అప్లికేషన్ స్టేటస్, వార్తలు, హెల్త్ కేర్ ఇలా ఎన్నో రకాల సేవలు, సమాచారం పొందడానికి అవకాశం ఉంది. ఈ యాప్ నుంచి బిల్లులు, పన్నుల చెల్లింపులకు గాను పేమెంట్ గేట్ వే కూడా ఉంది.

పీపుల్స్ ఫస్ట్representational imageఇది కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆవిష్కరణే. పౌరుల వివరాలు, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాల వివరాలు ఇందులో ఉంటాయి. పౌర సేవలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. ఈ యాప్ సాయంతో ప్రభుత్వ అధికారులు నేరుగా ప్రజలకు కాల్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలపై అభిప్రాయాలను స్వీకరిస్తారు. అదే సమయంలో పౌరులు సైతం తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వారు తమ ఆధార్ నంబర్ ఆధారంగా లాగిన్ అవొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన తమ కుటుంబ సభ్యుల వివరాలను పొందొచ్చు. అలాగే, కులం, నివాసం, ఆదాయం, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు.

ఆర్ టీఏ ఎం వాలెట్ఇది తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ రూపొందించిన యాప్. వాహనదారులు తమ వాహన డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకునేందుకు ఉద్దేశించినది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ పత్రాలను డిజిటల్ రూపంలో యాప్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆర్టీఏ, పోలీసు అధికారులు తనిఖీ సమయంలో ఇవి చూపిస్తే సరిపోతుంది. ఫిజికల్ గా అసలు పత్రాలను వెంట తీసుకెళ్లక్కర్లేదు. దీంతో అవి పోతాయని, వర్షానికి తడిసిపోతాయన్న భయం అక్కర్లేదు. ఒక్కసారి వాహన పత్రాలను డౌన్ లోడ్ చేసుకుంటే ఆఫ్ లైన్ లోనూ వాటిని యాసెస్ చేసుకోవచ్చు.

మై జీహెచ్ఎంసీrepresentational imageఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కు సంబంధించిన యాప్. ఐదు కీలకమైన సేవలను ఈ యాప్ అందిస్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పనితీరు, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ దీని ద్వారా అందుతాయి. వీటికి సంబంధించిన పత్రాలు డిజిటల్ రూపంలో పొందొచ్చు. మ్యాన్ హోల్స్, పాతోల్స్, చెత్త వేసే ప్రదేశాలు, వీధి లైట్లకు సంబంధించి పౌరులు ఫిర్యాదు చేయవచ్చు.

హాక్ ఐహైదరాబాద్ పోలీసు ఐటీ సెల్ దీన్ని అభివృద్ధి చేసింది. మహిళలు ప్రయాణాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం ఎస్ఓఎస్ బటన్ ను క్లిక్ చేయవచ్చు. తెలంగాణ పోలీసుల కాంటాక్టు నంబర్లు తెలుసుకునేందుకు, పోలీసులకు పిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ కు జాతీయ స్థాయిలో ఈ గవర్నెన్స్ కేటగిరీ కింద బంగారు అవార్డు కూడా వరించింది.

హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్representational imageజంట నగరాల పరిధిలో ట్రాఫిక్ సమాచార సేవల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. లోకల్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల సమాచారం, చిరునామా, అధికారుల కాంటాక్టు నంబర్లు, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు, రోడ్డుపై ప్రయాణించే సమయంలో పాటించాల్సిన టిప్స్, అత్యవసర కాంటాక్టు సమాచారం, ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానా, ఆటో చార్జీలు, లైవ్ ట్రాఫిక్ సమాచారం ఇలా ఎన్నో వివరాలు ఈ యాప్ లో లభిస్తాయి.

టీ వ్యాలెట్తెలంగాణ ప్రభుత్వం టీ వ్యాలెట్ పేరుతో ఓ యాప్ ను ఎప్పుడో విడుదల చేసింది. దీని ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. లావాదేవీలపై రుసుం ఉండదు. ఇది ప్రజలు, ప్రభుత్వానికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలన్ని పొందుతున్నప్పుడు... ప్రభుత్వం నేరుగా ప్రజలకు ప్రయోజనాలు అందించాలనుకుంటే అందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలకు చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రభు పథకాల లబ్దిదారులకు యాప్ ప్రయోజనాలను అందిస్తుంది.

టీ రేషన్representational imageతెలంగాణ పౌర సరఫరాల శాఖ టీ రేషన్ పేరుతో  ఒక యాప్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా  రేషన్ కార్డుదారులు తమ కార్డుపై ప్రభుత్వం ఎంత మేర కోటా విడుదల చేసింది?, ఏ రేషన్ షాపునకు?, ఓ రేషన్ షాపునకు విడుదల చేసిన కమోడిటీలు, ప్రస్తుతం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్, రేషన్ కార్డుపై జరిగిన లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు. రేషన్ షాపు నంబర్, డీలర్ పేరు, మొబైల్ నంబర్, రేషన్ షాపు తెరిచి ఉందా, లేక మూసేసి ఉందా తదితర సమాచారం తెలుసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.

Friday, September 2, 2016

Getting electricity bill more?check it ! (కరెంట్ బిల్లు అధికంగా వస్తోందా?... ఒకసారి వీటిని చెక్ చేయండి!)



వినియోగంలో మార్పు లేదు. కానీ, నెల తిరిగేసరికి విద్యుత్ బిల్లు భారీగా పెరిగిపోతోంది...? నెల క్రితం వచ్చిన బిల్లు కంటే ప్రస్తుతం వచ్చిన బిల్లు ఎక్కువగా ఉంది...? ఏడాది క్రితంతో పోలిస్తే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉపకరణాలు ఏవీ పెరగలేదు. కానీ బిల్లు ఎందుకంత ఎక్కువగా వచ్చింది...? అయితే వీటిని ఓ సారి పరిశీలించాల్సిందే...
తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లు, అంతకు ముందు నెల బిల్లు... ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన బిల్లును ఓసారి బయటకు తీయండి. తాజా బిల్లులో ఎన్ని యూనిట్లు ఉన్నదీ పరిశీలించాలి. అంతకుముందు నెలల్లోనూ అన్నే యూనిట్ల వినియోగం ఉండి బిల్లు అమౌంట్ పెరిగిందంటే విద్యుత్ చార్జీలు పెరిగాయేమో చూసుకోవాలి. విద్యుత్ వినియోగ టారిఫ్ ను పెంచి ఉంటే కొత్త చార్జీల ప్రకారం లెక్కిస్తే తెలిసిపోతుంది. విద్యుత్ చార్జీలు పెరగకపోయినా బిల్లు మొత్తం పెరగడానికి సర్ చార్జీ, ఇతర చార్జీలు బిల్లులో వచ్చి చేరాయేమో పరిశీలించాలి.
స్నేహితుల ఇళ్లల్లో వినియోగం...
స్నేహితులు ఎంతో మంది ఉంటారు. మీ ఇంట్లో ఏఏ విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో ఓ సారి నోట్ చేసుకోండి. ఇప్పుడు అచ్చం అన్నే ఉపకరణాలు ఉన్న స్నేహితుల గురించి విచారించి... వారికి ఎంత బిల్లు వస్తుందో అడిగి తెలుసుకుంటే... సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది.
మీటర్ చెకింగ్
తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లులో వినియోగ యూనిట్లు, అంతకుముందు నెలల్లో ఉన్న వినియోగం కంటే పెరిగి ఉంటే... బిల్లు కాల వ్యవధిలో ఇంట్లో ఏవైనా వేడుకలు జరిగాయా, బంధువులు కొన్ని రోజులు ఇంట్లో ఉండి వెళ్లారా, వేసవి అయితే ఏసీ వాడకం పెరిగిందా ఇలాంటి అంశాలను ఓ సారి చెక్ చేసుకోవాలి. అయినా, మీ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎప్పటిలానే ఉంటే... మీటర్ రీడింగ్ నమోదులో పొరపాటు జరిగిందా లేక సమస్య మీటర్ లో ఉందేమో పరిశీలించి విషయాన్ని రూఢీ చేసుకోవాల్సి ఉంటుంది.  
మీటర్ రీడింగ్ సరిగానే ఉంటే...?
ఒకవేళ మీటర్ రీడింగ్ సరిగానే ఉందనుకుంటే... విద్యుత్ సరఫరా పరంగా ఎక్కడైన లీకేజీలు ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందు కోసం ముందుగా మెయిన్ ఆఫ్ చేయాలి. అప్పుడు కూడా మీటర్ తిరుగుతోందా...? అన్నది చెక్ చేయాలి. ఒకవేళ డిజిటల్ నంబర్ చూపించే మీటర్ అయితే... మెయిన్ ఆఫ్ చేసి ఉంచి రీడింగ్ నమోదు చేసి.... ఓ గంట రెండు గంటల తర్వాత తిరిగి రీడింగ్ చూడాలి. రీడింగ్ లో మార్పు ఉందా? గమనించాలి. మెయిన్ ఆఫ్ చేసి ఉంచినా మీటర్ రీడింగ్ పెరుగుతూనే ఉంటే సమస్య ఉన్నట్టు గుర్తించాలి.
మీటర్ పాడై అలా జరుగుతోందా...? లేక రహస్యంగా మీ మీటర్ కు వేరే వారి విద్యుత్ వైరు అనుసంధానమైందా? అన్నది ఎలక్ట్రీషియన్ సాయంతో తెలుసుకోవాలి. అలా వేరే ఏ ఇతర వైర్ కూడా మీ మీటర్ కు అనుసంధానమైనట్టు లేకపోతే సమస్య మరో చోట ఉన్నట్టే.
మెయిన్ ఆన్ చేసి... ఇప్పుడు ఒక్కో పరికరాన్ని మాత్రమే ఆన్ చేస్తూ రీడింగ్ సరిగ్గా ఉందేమో పరిశీలించాలి. ఒక కిలోవాట్ విద్యుత్ వినియోగంతో ఒక యూనిట్ మాత్రమే పెరగాలి. దీన్ని తెలుసుకోవాలంటే వన్ టన్ ఏసీ ఒక గంటపాటు ఆన్ చేసి ఉంచండి. ఒక యూనిట్ ఖర్చవుతుంది. లేదా 100 వాట్ల బల్బ్ ను 10 గంటల పాటు ఉంచినా ఒక యూనిట్ వ్యయం అవుతుంది. దాన్ని బట్టి మీటర్ రీడింగ్ సరిగ్గా ఉందో, లేదో తెలుస్తుంది.
మెయిన్ ఆఫ్ చేసినా, మరే ఇతర విద్యుత్ వైర్లు అనుసంధానం కాకపోయినా మీటర్ తిరుగుతూ ఉంటే సమస్య మీటర్ లో ఉందని అనుమానించవచ్చు. అప్పుడు విద్యుత్ విభాగానికి మీటర్ లో  సమస్య ఉన్నట్టు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారు ఆ మీటర్ ను మారుస్తారు. అధికంగా వసూలు చేసిన చార్జీలు వెనక్కి ఇవ్వాలని కోరితే మాత్రం మీటర్ ను టెస్టింగ్ కు పంపిస్తారు. టెస్టింగ్ చార్జీలను వినియోగదారుడే భరించాలి. పరీక్షల్లో మీటర్ లో సమస్య ఉందని నిర్ధారణ అయితే అధికంగా చెల్లించిన మొత్తాలను తర్వాతి బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు.  
వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలు....
అన్నీ సవ్యంగా ఉండి, విద్యుత్ వినియోగం అధికమై బిల్లు భారంగా మారితే... వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ట్యూబ్ లైట్లు, ఇన్ కాండిసెంట్ బల్బ్ ఉంటే వాటి స్థానంలో ఎల్ ఈ డీ బల్బులు అమర్చుకోండి. 10/10 గదికి 9, 10 వాట్ల ఎల్ ఈడీ బల్బ్ వెలుగు సరిపోతుంది. 12/12 రూమ్ అయితే, 14 వాట్ బల్బ్ చాలు. దాంతో 20 వాట్స్ కు పైన ఆదా అవుతుంది. ముఖ్యంగా బాత్ రూమ్, దేవుని మందిరాలలో లైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. వాటి స్థానంలో 1 లేదా 2 వాట్ల ఎల్ ఈడీ బల్బ్ లను అమర్చండి. గదుల్లో అవసరమైన ప్రదేశాల్లోనే లైటింగ్ పడేట్లు చూసుకోవడం వల్ల అవసరం లేని చోట బల్బ్ లను ఆఫ్ చేసుకోవడానికి వీలుంటుంది.
సీలింగ్ ఫ్యాన్లు 40, 50 వాట్లవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత ఫ్యాన్ల స్థానంలో వాటిని వాడుకోవడం వల్ల ఎంతో ఆదా అవుతుంది. మామూలు లోకల్ బ్రాండ్ ఫ్యాన్లు 90 వాట్ల వరకు విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అదే బ్రాండెడ్ లో రేటింగ్ లేనివి అయితే75 వాట్ల వరకు విద్యుత్ ను ఖర్చు చేస్తాయి. ఏ ఇంట్లో అయినా ఎప్పుడూ వినియోగంలో ఉండే పరికరాలు ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ లు. అందుకే 5 స్టార్ రేటింగ్ ఉన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడుకోవడం వల్ల వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైగా ఫ్రిడ్జ్ లను వేడి తగిలే చోట కాకుండా, గోడ నుంచి కనీసం నాలుగైదు అంగుళాల దూరంలో ఉంచడ వల్ల వినియోగం తగ్గుతుంది.  
1 టన్ ఏసీ 25 డిగ్రీల కంటే ఎక్కువలో సెట్ చేసుకోవడం వల్ల వినియోగం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు 1 టన్ను ఏసీ గంటకు ఒక యూనిట్ ఖర్చు చేస్తుందనుకుంటే.... అదే ఇన్వర్టర్ టెక్నాలజీతో ఉన్న ఏసీని వాడడం వల్ల 0.60యూనిట్ వరకే విద్యుత్ ఖర్చు అవుతుంది. అత్యవసర సమయాల్లో ఇంట్లో ఐరన్ చేసుకుంటే చేసుకున్నారు, కానీ మిగిలిన సమయాల్లో బయట చేయించుకోవడం నయం. ఎందుకంటే మొత్తం మీద యూనిట్లు పెరిగిపోతే శ్లాబ్ రేట్ మారిపోయి బిల్లు భారంగా మారుతుందని గుర్తించాలి. మరీ ముఖ్యంగా కొనే ఏ ఎలక్ట్రిక్ ఉపకరణం అయినా 5 స్టార్ రేటింగ్ లో ఉండి వినియోగం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 
ఇక స్విచాఫ్ చేసినా కూడా కొన్ని రకాల పరికరాలు విద్యుత్ వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఓవెన్ ఉంటుంది. అందులో ఆహారం పెట్టినప్పుడే ఆన్ అవుతుంది. కానీ, ఆన్ అయ్యేందుకు సిద్ధంగా ఉండేందుకు దానికి కొంత విద్యుత్ ఖర్చు అవుతుంది. కంప్యూటర్లు, టీవీలు, డీవీఆర్ లు వీటిల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకే వీటిని వాడేందుకు ఓ మార్గం ఉంది. ప్లగ్ సాకెట్లతో ఉండే పవర్ స్ట్రిప్ తెలిసే ఉంటుంది. ఎక్కువగా కంప్యూటర్, సీపీయూలను అనుసంధానించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈ స్ట్రిప్ కు ఉపకరణాలను అటాచ్ చేయండి. వాడే అవసరం లేనప్పుడు మెయిన్ ప్లగ్ సాకెట్ లో, పవర్ స్ట్రిప్ వద్ద కూడా ఆఫ్ చేయడం వల్ల దుర్వినియోగం ఉండదు. 
డిష్ వాషర్లు, క్లాత్ వాషింగ్ మెషిన్లు బాగా విద్యుత్ ను వాడేస్తాయి. అందుకే రెండు మూడు వస్త్రాలను వాషింగ్  మెషిన్ లో వేసి ఆన్ చేయకండి. తక్కువ వస్త్రాలుంటే వారానికి ఒకసారి లేదా రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే పూర్తి లోడ్ వరకు వస్త్రాలు వేసి వాషింగ్ మెషిన్ ను ఉపయోగించాలి. అలాగే వంట పాత్రలను కూడా పూర్తి లోడ్ మేరకు వేసి వినియోగించుకోవడం వల్ల దుర్వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.
పాత వాటితో ఇబ్బందే
మరీ ఎన్నో ఏళ్ల క్రితం కొన్న విద్యుత్ ఉపకరణాలు వాడడం వల్ల కూడా బిల్లు పెరిగిపోతుంది. అందుకే వాటి కాలపరిమితి దాటిందనుకుంటే మార్చివేయడం మంచిది. ఉదాహరణకు సీలింగ్ ఫ్యాన్ అయితే ఎనిమిదేళ్ల తర్వాత వాడకపోవడం ఉత్తమం. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ఉన్న సీలింగ్ ఫ్యాన్ 90 వాట్లకు పైగా విద్యుత్ ను వాడుకుంటుందని పరీక్షల్లో తేలింది.http://vidyut1.blogspot.in/2016/07/on-line-marketing-links.html

Thursday, September 1, 2016

MUTUAL FUNDS INFORMATION (మ్యూచువల్ ఫండ్ )


నెలకు కేవలం వెయ్యి రూపాయల పొదుపుతో కోటి రూపాయల సంపదకు యజమాని అయ్యే అవకాశం కేవలం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వల్లే సాధ్యం. 20 ఏళ్ల వయసు నుంచి నెలకు వెయ్యి రూపాయల చొప్పున 60 ఏళ్ల వరకు పొదుపు చేస్తూ వెళితే... సగటున 12 శాతం వార్షిక వృద్ధి అంచనా ప్రకారం సమకూరే నిధి 1,17,64,773 రూపాయలు. అందుకే ప్రతీ ఒక్కరి జీవితంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు తప్పక చోటు ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఎన్నో రకాలు ఉన్నట్టే... వాటి కొనుగోలుకు ఎన్నో మార్గాలున్నాయి. అందుకే ఇన్వెస్ట్ మెంట్ ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తెలుసుకోవడం చాలా ఉపయోగకరం. 

మ్యూచువల్ ఫండ్  ఏమిటి? మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌కి ఉదాహారణ: మ్యూచువల్ ఫండ్స్‌ గురించి అర్ధం అయ్యేందుకు మీకు ఒక ఉదాహరణ వివరిస్తాను. సూపర్ రిటర్న్స్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సూపర్ రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్ అనే పధకాన్ని ప్రవేశపెట్టింది అనుకుందాం. ఈ పధకం క్రింద సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ స్కీమ్ ఉంది. స్టాక్ మార్కెట్ల నుంచి ఈ స్కీమ్ క్రింద వివిధ పెట్టుబడిదారుల నుంచి సుమారు రూ. 100కోట్లు సేకరించింది. ఈ స్కీమ్ గనుక ఈక్విటీ స్కీమ్ ఐతే షేర్లలో ఎక్కువ మొత్తం వెచ్చించాల్సి ఉంటుంది. అదే రుణ స్కీమ్ ఐతే ఈ డబ్బుని గవర్నమెంట్ సెక్యూరిటీస్, బాండ్లలలో మదుపు చేస్తారు. ఈ ఫండ్ మొదట్లో ఒక యూనిట్‌ను రూ. 10కి ఇచ్చిందని అనుకుందాం. ఒక్కో యూనిట్‌కు గాను రూ. 10 కాబట్టి మొత్తంగా రూ. 10,000 చెల్లించి 1000 యూనిట్లను కొనుగోలు చేశారు. ఒక్క సంవత్సరం తర్వాత సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు చేరింది. ఈ సమయంలో మీరు మీ యూనిట్స్‌ను తిరిగి మ్యూచవల్ ఫండ్స్‌కు అమ్మినట్లైతే, మీరు కొనుగోలు చేసిన 1000 యూనిట్లకు గాను మీరు రూ. 12,000 పొందుతారు. కొత్త యూనిట్లను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారుకి దీని వల్ల ఉపయోగం ఏంటీ? కొత్తగా యూనిట్లను కొనుగోలు చేయాలనుకునే కొనుగోలుదారుడు రూ. 12 చెల్లించి యూనిట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాతి కాలంలో సూపర్ రిటర్న్ మిడ్ క్యాప్ ఫండ్ విలువ రూ. 12కు మించి పెరిగితే ఆ సమయంలో మీరు మీ యూనిట్లను అమ్ముకోవచ్చు. దీంతో మీరు ఎక్కువ డబ్బును పొందగలుగుతారు. మ్యూచువల్ పంఢ్స్ వల్ల లాభాలు: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్‌ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో వుంటాయి.
 1. ఈక్విటీ ఫండ్స్ ఈక్వీటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారుల నుంచి డబ్బుని సేకరించే ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్ అంటారు. ఇవి చాలా ఎక్కువ రిస్క్‌తో కూడుకున్నవి. ఈ ఫండ్స్ వల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్.

 2. డెట్ ఫండ్స్ డెట్ ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీ ఫండ్స్. అంటే మీరు ఈ ఫండ్స్‌ల్లో ఎప్పుడైనా, ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే ఎప్పుడైనా, ఈ ఫండ్స్‌నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకోవచ్చు. కొన్ని డెట్ ఫండ్స్‌ల్లో మీకు అసలు నష్టాలే రావు. ప్రభుత్వ సెక్యూరిటీస్, కార్పోరేట్ డెట్, బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీమ్‌లలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అంటారు. ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి.

 3. బ్యాలె‌న్స్‌డ్ ఫండ్స్ మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా ఈక్విటీల్లో పెట్టుబడులు చేయడానికి విభిన్నమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆరునెలలు లేదా సంవత్సరం పాటు చిన్న మొత్తంతో బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం మంచిది. ఐదేళ్ళ కాలానికైతే బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కంటే లార్జ్‌క్యాప్ ఫండ్స్ అనువైనవి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధికమించి రాబడులను అందించేది ఈక్విటీలు మాత్రమే. 

4. మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌కు మరో పేరు లిక్విడ్ ఫండ్స్. డిపాజిట్లు, ట్రెజరీ, పేపర్ల ద్వారా తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో డబ్బుని పెట్టుబడి పెట్టే ఫండ్స్‌ను మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ అంటారు. ఈ మనీ మార్కెట్ మ్యూచవల్ ఫండ్స్‌ తక్కువ కాలం వ్యవధికి పెట్టుబుడులు పెడతారు. 5 గిల్ట్ ఫండ్స్ గిల్ట్ ఫండ్స్ అంటే సెక్యూరిటీ ఎక్కువగా ఉంటే ఫండ్స్. గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో పెద్ద మొత్తంలో డబ్బుని మదుపు చేస్తారు. ఈ డబ్బుని బ్యాంకింగ్ రంగంలో మదుపు చేయడం వల్ల మీ డబ్బుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

డైరెక్ట్ ప్లాన్స్, రెగ్యులర్స్ ప్లాన్స్ మధ్య ఉన్న తేడా
ఆన్ లైన్ లో ఏఎంసీ వెబ్ సైట్లు, ఎంఎఫ్ యుటిలిటీ, మరి కొన్ని వేదికల్లో మాత్రమే డైరెక్ట్ ప్లాన్స్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మిగతా  తటస్థ వేదికల ద్వారా అయినా కొనుగోలు చేసేవి రెగ్యులర్ ప్లాన్స్ కిందకే వస్తాయి. పెట్టుబడి దారులకు డైరెక్ట్ ప్లాన్స్ అందించాలని 2012లో సెబీ ఆదేశించింది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ పథకం నిర్వహణ కోసం ఏఎంసీలకు కొంత వ్యయం అవుతుంది. ఓ పథకానికి ఫండ్ మేనేజర్ల దగ్గర నుంచి ఎంతో మంది పనిచేసే వారు ఉంటారు. వారికి వేతనాల రూపంలో అయ్యే ఖర్చులు, కంపెనీ లాభాలు, డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంటు కమీషన్ చెల్లింపు ఇవన్నీ కలిపి నిర్ణీత శాతాన్ని ఎక్స్ పెన్స్ రేషియోగా పేర్కొంటారు. 
డైరెక్ట్ ప్లాన్స్ లో డిస్ట్రిబ్యూటర్లు లేదా ఏజెంట్లకు కమీషన్ చెల్లించే పని ఉండదు. రెగ్యులర్ ప్లాన్స్ లో కమీషన్ ఖర్చులు ఉంటాయి. దీంతో పథకాన్ని బట్టి వీటి మధ్య ఎక్స్ పెన్స్ రేషియో మారుతుంటుంది. ఉదాహరణకు హెచ్ డీఎఫ్ సీ టాప్ 200 పథకాన్ని తీసుకుంటే 2016 ఏప్రిల్ 30 నాటికి డైరెక్ట్ ప్లాన్ ఎక్స్ పెన్స్ రేషియో 1.64 శాతం కాగా, రెగ్యులర్ ప్లాన్స్ ఎక్స్ పెన్స్ రేషియో 2.25 శాతం.  0.61శాతం తేడా కనిపిస్తోంది. ఈ స్వల్ప శాతమే 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల కాలంలో పెట్టుబడులపై రాబడుల విషయంలో తేడా చూపెడుతుంది.
ఉదాహరణకు నెలకు ఐదు వేల రూపాయల చొప్పున పదేళ్ల పాటు ఓ పథకంలో రవి, కిరణ్ పదేళ్ల పాటు పెట్టుబడి పెట్టారనుకుందాం. ఒకరు డైరెక్ట్ ప్లాన్ అయితే, మరొకరు రెగ్యులర్ ప్లాన్ ఎంచుకున్నారు. ఎక్స్ పెన్స్ రేషియో .50 శాతం తేడా ఉంది. పదేళ్ల పాటు పెట్టుబడి పెడితే రెగ్యులర్ ప్లాన్ లో 9,40,969 రూపాయలు కాగా, డైరెక్ట్ ప్లాన్ లో 10,55,096 అయింది. పదేళ్లలో 1,15,000 తేడా కనిపిస్తోంది కదా. ఇదే 20 ఏళ్ల పాటు అయితే, తేడా రూ.5 లక్షలు, 30 ఏళ్ల పాటు అయితే 16 లక్షల రూపాయలు వస్తుంది. అంటే ఇంత మేర రెగ్యులర్ ప్లాన్ లో పెట్టుబడి పెట్టిన వారు నష్టపోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఈక్విటీ ఆధారిత పథకాల్లోనే ఇంత మేర తేడా ఉంటుంది. అదే బ్యాలన్స్ ఫండ్స్ లో ఈ ఎక్స్ పెన్స్ రేషియో తేడా తక్కువగా, డెట్ ఫండ్స్ లో ఇంకా తక్కువగా ఉంటుంది. 
ఎన్ఏవీ నిర్ణయించేది ఎలా
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు యూనిట్ల రూపంలో ఉంటాయి. ప్రతీ యూనిట్ కు నెట్ అస్సెట్ వేల్యూ (ఎన్ఏవీ) కేటాయిస్తారు. ఇది ఎలా అంటే ఉదాహరణకు మీరు ఓ పథకంలో 5వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. ఆ పథకం యూనిట్ ఎన్ఏవీ కొనుగోలు తేదీన 20 రూపాయలు ఉందనుకోండి. అప్పుడు 5వేల రూపాయలకు 250 యూనిట్లు వస్తాయి. యూనిట్ విలువ ప్రతీ రోజూ మారుతుంటుంది. స్టాక్ మార్కెట్లో షేర్ల ధరల మాదిరిగానే మ్యూచువల్ ఫండ్ యూనిట్ల ఎన్ఏవీలో మార్పులు జరుగుతుంటాయి. ఉదాహరణకు ఓ పథకం కింద ఏఎంసీకి 2వేల కోట్ల రూపాయలు ఉన్నాయనుకోండి. వాటిని భిన్న రకాలుగా మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. వాటిని యూనిట్లుగా విభజిస్తారు కనుక ప్రతీ రోజు పెట్టుబడుల విలువను, యూనిట్లతో లెక్కించి ఎన్ఏవీని నిర్ణయిస్తుంటారు.

ఓ పథకం కింద 2వేల కోట్లు రూపాయల పెట్టుబడులు ఉన్నాయి. అప్పుడు ఆ ఫండ్ ఎన్ఏవీ 2వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఈ మొత్తాన్ని యూనిట్లతో భాగించగా అప్పుడు ఒక్కో యూనిట్ ఎన్ఏవీ ఎంతో తెలుస్తుంది. ఓ పథకం ప్రారంభంలో 100 కోట్ల రూపాయలు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చాయనుకోండి. 10 రూపాయల ముఖ విలువతో ఫండ్ హౌస్ యూనిట్లను కేటాయిస్తుంది. తర్వాత కాలంలో ఆ పెట్టుబడుల విలువ వృద్ధి చెందుతూ దానికనుగుణంగా యూనిట్ ఎన్ఏవీ కూడా పెరుగుతూ వెళుతుంది. తర్వాత కాలంలో కొనుగోలు చేసే ఇన్వెస్టర్లకు 10 రూపాయల ముఖ విలువ ఉన్న యూనిట్ ను మార్కెట్ ధర ప్రకారం కేటాయిస్తారు. 
కొనుగోలుకు వర్తించే ఎన్ఏవీ
లిక్విడ్ ఫండ్స్ ఎన్ఏవీని సెలవు రోజుల్లో (ఆదివారం) ప్రకటిస్తుంటారు. ఇలా సెలవు రోజుల్లో ప్రకటించిన ఎన్ఏవీ ధరే తదుపరి సెలవు రోజు కొత్త ఎన్ఏవీ ప్రకటించే వరకు అమల్లో ఉంటుంది. ఉదాహరణకు సోమవారం మధ్యాహ్నం 2లోపు లావాదేవీకి సంబంధించిన రిక్వెస్ట్ అందితే, ఫండ్ హౌస్ వద్ద దరఖాస్తు దారుడి కొనుగోలు విలువకు సరిపడా నిధులు ఉంటే అంతకుముందు రోజు ఎన్ఏవీ ధర ప్రకారం యూనిట్లు కేటాయిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత లావాదేవీ అయితే అదే రోజు ముగింపు ధర ప్రకారం మరుసటి రోజు యూనిట్లు కేటాయిస్తారు. 
అదే లిక్విడ్ ఫండ్స్ ఉపసంహరణకు సంబంధించిన డెడ్ లైన్ మధ్యాహ్నం 3 గంటలు. ఆ లోపు వచ్చిన దరఖాస్తుదారులకు ఆ రోజు ముగింపు ధర ప్రకారం మర్నాడు యూనిట్లు విక్రయించి నగదు చెల్లింపులు చేస్తారు. అదే ఈక్విటీ ఇతర ఫండ్ల విషయంలో... మధ్యాహ్నం మూడు గంటల లోపు కొనుగోలు, విక్రయం (ఉపసంహరణ) కోసం వచ్చిన దరఖాస్తులకు అదే రోజు ఎన్ఏవీ వర్తిస్తుంది. మూడు గంటల తర్వాత అందే దరఖాస్తులకు మర్నాడు ఎన్ఏవీ వర్తిస్తుంది. 
రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కిందకు మార్చుకోవచ్చా...?
ఏఎంసీని సంప్రదించి నిర్ణీత ఫారమ్ ను సమర్పించి రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కిందకు మార్చుకోవచ్చు. అయితే, ఎగ్జిట్ చార్జీలు భరించాల్సి ఉంటుంది. పన్ను పరంగా ప్రయోజనాలు ఉంటే కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్ ప్లాన్స్ ను డైరెక్ట్ ప్లాన్స్ కింద మార్చాలంటే ఆ యూనిట్లను విక్రయించి తిరిగి డైరెక్ట్ ప్లాన్స్ కింద యూనిట్లను కొనుగోలు చేస్తారు. అయితే, రెగ్యులర్ ప్లాన్స్ కింద పెట్టుబడి పెట్టి ఏడాది దాటితే ఎలాంటి ఉపసంహరణ చార్జీలు ఉండవు. ఒకవేళ ఏడాదిలోపే అయితే, వాటిని ఉపసంహరించుకోకుండా అలా ఉంచి... డైరెక్ట్ ప్లాన్స్ లో  ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ప్లాన్ కింద పెట్టుబడులు ఏడాది పూర్తయిన తర్వాత డైరెక్ట్ ప్లాన్ కిందకు ఎలాంటి చార్జీలు లేకుండా మార్చుకోవచ్చు. ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మినహా మరే ఇతర ఫండ్స్ ను అయినా మార్చుకోవచ్చు.
చార్జీలు
మ్యూచువల్ ఫండ్స్  యూనిట్ల కొనుగోలుకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఏడాదిలోపు ఉపసంహరించుకున్న సందర్భాల్లోనే నిర్ణీత చార్జీలు విధిస్తారు. ఈ చార్జీలు ఆరు నెలలలోపు అయితే 2శాతం, ఆ తర్వాత నుంచి ఏడాది లోపు 1 శాతం మేర ఉంటాయి.

మంచి పథకాలను ఎంచుకునే విధానం
దేశంలో సుమారు 44కుపైగా అస్సెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఇవి పది వేలకు పైగా పథకాలను నిర్వహిస్తున్నాయి. 2016 మార్చి నాటికి ఏఎంసీల నిర్వహణలో ఉన్న ఇన్వెస్టర్ల నిధులు సుమారుగా 14 లక్షల కోట్లు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న పథకాల్లో మంచి వాటిని ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తేనే అధిక ప్రతిఫలం అందుకోవడం సాధ్యమవుతుంది. 
ఒక మంచి పథకాన్ని ఎంచుకోవడానికి గణాంకాలే ప్రామాణికం. పనితీరులో ఉత్తమంగా ఉన్న స్కీమ్స్ గురించి వెబ్ సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. గత ఐదు పదేళ్ల కాలంలో ఆ ఫండ్ పనితీరు ఎలా ఉందన్నది చూడాలి. ఎంత శాతం సగటున వార్షిక ప్రతిఫలాన్ని అందించిందన్నది ముఖ్యం. కొత్త పథకమైతే మూడేళ్ల పనితీరును ప్రామాణికంగా తీసుకోవాలి. మొదటి క్వార్టయిల్ ర్యాకింగ్ లో ఉన్న ఫండ్స్ పనితీరులో ఉత్తమమైనవి. పనితీరులో దారుణంగా ఉన్నవి నాలుగో క్వార్టయిల్ ర్యాంకింగ్ లో ఉంటాయి. 
క్వార్టయిల్ ర్యాకింగ్ అనేది వివిధ పారా మీటర్ల (పథకంలో ఉండే రిస్క్, ఎక్స్ పెన్స్ రేషియో వంటివి) ఆధారంగా పథకాన్ని మదింపు వేసి పెట్టుబడుల పరంగా దానికి ర్యాంక్ ఇచ్చే విధానం. ఉదాహరణకు ఓ పథకం మూడేళ్లు పూర్తి చేసుకుంటే దాని విషయంలో మూడేళ్ల కాలాన్ని తొమ్మిది నెలల చొప్పున నాలుగు భాగాలు చేసి విశ్లేషించి ర్యాకింగ్ ఇస్తారు. 
ప్రతీ ఫండ్ హౌస్ వెబ్ సైట్ కు వెళితే ప్రతీ పథకం సమాచారం లభిస్తుంది. పనితీరు వివరాలు, పోర్ట్ ఫోలియో ... అంటే ఏ ఏ కంపెనీ షేర్లలో ఎంత మేర పెట్టుబడులు ఉన్నాయో తెలుస్తుంది. ఫండ్ మేనేజర్ వివరాలు ఉంటాయి. ఎక్స్ పెన్స్, టర్నోవర్ రేషియో వివరాలు తెలుస్తాయి. వీటి ఆధారంగా కూడా ఓ నిర్ణయానికి రావచ్చు. 
ఒకరు ఓ పథకాన్ని ఎంచుకునే ముందు తప్పకుండా చూడాల్సినది  ఎక్స్ పెన్స్ రేషియో. ఉదాహరణకు నెల నెల రెండు పథకాల్లో వెయ్యి రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టాలనుకుంటే ముందు మంచి రాబడుల చరిత్ర ఉన్న నాలుగు పథకాలను ఎంపిక చేసుకోండి. అప్పుడు వాటి డైరెక్ట్ ప్లాన్స్ లేదా రెగ్యులర్ ప్లాన్స్ ఎక్స్ పెన్స్ రేషియోను పరిశీలించండి. ఎక్స్ పెన్స్ రేషియో తక్కువగా ఉన్నది ఎంపిక చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో రాబడుల్లో పైన చెప్పుకున్నట్టే గణనీయమైన తేడా కనిపిస్తుంది.
ఓ పథకం కింద పెట్టుబడుల నిర్వహణ, రాబడులు ఫండ్ మేనేజర్ శక్తి, సామర్థ్యాలపైనే ఆధారపడి ఉంటాయి. అందుకే పథకంలో పెట్టుబడి పెట్టేముందు సదరు మేనేజర్ ట్రాక్ రికార్డును పరిశీలించాలి. సదరు మేనేజర్ గతంలో నిర్వహించిన పథకాలు, పనితీరు, ఆ మేనేజర్ నిర్వహణలో ఉన్న మొత్తం పథకాలను చూడాల్సి ఉంటుంది. 
ఫండ్స్ రకాలు
ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్, ఇంటర్వల్ అని వైవిధ్యంతో కూడిన ఫండ్ పథకాలు ఉన్నాయి.
1.డెట్/ఇన్ కమ్
ఫండ్ నిధుల్లో అధిక మొత్తాన్ని డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలతో పెట్టుబడి పెడతారు. ఈక్విటీ పథకాలతో పోలిస్తే ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అంటే రిస్క్ తక్కువ, ప్రతిఫలం తక్కువ అనే తీరులో వీటి పనితీరు ఉంటుంది. పెద్దగా రిస్క్ తీసుకోలేని వారికి, స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇవి అనువైనవి.
2. మనీ మార్కెట్/లిక్విడ్
స్వల్ప కాలానికి అంటే కేవలం నెలల వ్యవధి కోసం అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నగదుగా మార్చుకోవచ్చు. పైగా చెప్పుకోదగ్గ వడ్డీ గిట్టుబాటవుతుంది. స్వల్ప కాలిక డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసి ప్రతిఫలాలను అందిస్తాయి. ఏదైనా అవసరం కోసమో లేక మంచి పెట్టుబడి అవకాశం కోసమే నగదును సిద్ధం చేసుకున్న తర్వాత కొంత సమయం ఉందనుకోండి. ఆ నగదును సేవింగ్స్ ఖాతాలో అట్టి పెట్టుకోవడం కంటే ఈ పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం ఉత్తమం. 8 శాతం వరకు ప్రతిఫలాన్నిస్తాయి.

Monday, July 25, 2016

On line shopping and recharges links get discounts (ఈ లింక్స్ ద్వారా షాపింగ్ చెయ్యండి,డిస్కౌంట్ పొందండి)


  Online లో flipcart,amazon,ebay,snapdeal,shopclues,paytm,bigbasket etc shopping చేసేవారికి మరియు freecharge,airtel etc ద్వారా recharge చేసుకొనేవారికి నేనిచ్చిన ఈ లింక్స్ ద్వారా orderఇస్తే discounts పొందే అవకాశం కలదు.మీరిచ్చిన  order delivery అయిన తర్వాత మాత్రమే ఎంత discount వచ్చే అవకాశం తెలుస్తుంది.Order delivery అయిన తర్వాత  BLOG,MESSAGE  ద్వారాతెలియపరిస్తే  ఏదైనా discount amount వస్తే తెలియ చేస్తాను.మనం రెగ్యులర్ గా ఎలాగూ కొంటాము.కొనేవాటి మీద ఒక రూపాయి కలసివచ్చినా సంతోషమే కదా !.ఈ క్రింద ఇచ్చినవే కాకుండా ఇంకా ఏవైనా ఆన్ లైన్ షాపింగ్ websites తెలియపరిస్తే ఆ లింక్స్ పెట్టడానికి ప్రయత్నిస్తాను. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు.

FLIP CART-http://clnk.in/doRn                           

PAYTM-http://clnk.in/doK8,

AMAZON INDIA-http://clnk.in/doRr

SNAPDEAL-http://clnk.in/doRv

TATA CLIQ-http://clnk.in/dpR9

EBAY-http://clnk.in/dpPq

EZONE-http://clnk.in/dp9y

SHOPCLUES-http://clnk.in/dpQO

AIRTEL-http://clnk.in/do8m

BIG BASKET-http://clnk.in/doFm

FREE CHARGE-http://clnk.in/dpPl

MOBIWIK-http://clnk.in/dpRj

FOOD PANDA-http://clnk.in/dpQg

TATA SKY-http://clnk.in/dpSa

RED BUS-http://clnk.in/dqyo

CLEAR TRIP-http://clnk.in/dqyw

VOONIK http://clnk.in/dsWO

Saturday, July 16, 2016

SOLAR POWER INFORMATION (సోలార్ విద్యుత్ ఇంటికి అయ్యే ఖర్చుల వివరాలు)




Swach Bharat Swach Urja.
Make your rooftop solar, and earn power and money .
For details pls call  9963000447
హైదరాబాద్: ఇక మీ ఇంటి నుంచే కరెంటు ఉత్పత్తి చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఇళ్లు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలపై సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ వ్యవస్థ ఏర్పాటు మార్గదర్శకాలను విడుదల చేసింది. 
ఇళ్లు, కార్యాలయం యజమానులు చేయాల్సింది
* స్థానిక విద్యుత్ డివిజన్ ఇంజినీరు(డీఈఈ)ని కార్యాలయంలో సంప్రదించాలి. 
* ఉత్పత్తి స్థాయిని బట్టి దరఖాస్తు రుసుం చెల్లించాలి. 
* ఒకటి నుంచి ఆరు కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి సమార్థ్యం వాటికి రూ.1500లు చెల్లించాలి.
* ఆరు నుంచి 100 కిలోవాట్ల వరకు రూ.10వేలు చెల్లించాలి.
* వంద నుంచి ఒక కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 50 వేలు చెల్లించాలి. 
* మనం దరఖాస్తు చేసుకున్న 21 రోజుల లోపు విద్యుత్ సిబ్బంది మీ ఇళ్లు, కార్యాలయం ఫీల్డ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. 
* 21 రోజుల లోపల నెట్ మీటరింగ్ కనెక్షన్‌కు అవకాశం ఉందా, లేదా అన్న విషయం డిస్కం తెలియజేస్తుంది. 
* డిస్కం అధికారులు అభ్యంతరం తెలపకుంటే దరఖాస్తు ఆమోదించినట్లుగా వినియోగదారులు పరిగణించాలి. 
* కనెక్షన్‌కు ఎంత ఖర్చు అవుతుందన్న సంగతి డిస్కం అధికారులు తెలియజేస్తారు. డిస్కం అధికారులు ఎస్టిమేషన్ తెలిపిన 15 రోజుల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 
* గరిష్ఠంగా ఒక కిలోవాట్‌కు మించి నెట్‌మీటరింగ్‌కు అనుమతించరు. 
* 75 కిలోవాట్లకు మించి ఉత్పత్తి సమార్థ్యం కలిగి ఉంటే బీమా చేయించుకోవాలి. దీనికి స్థానిక విద్యుత్ ఇన్‌స్పక్టర్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలి. 
* 75 కిలోవాట్లకు మించి ఏర్పాటు చేస్తే హైటెన్షన్ లెన్లకు మాత్రమే అనుసందానం చేయాల్సి ఉంటుంది. 
* ఇల్లు, భవనం, ఖాళీ స్థలంలోనూ సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. నేలకు 2.44 మీటర్ల ఎత్తులో వీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 
* వీటి వల్ల జరిగే ప్రమాదాలకు డిస్కం బాధ్యత వహించదు.


Tuesday, June 14, 2016

HOW TO CALCULATE THE POWER CONSUMPTION (ఏ పరికరానికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో .. ఇలా లెక్కపెట్టొచ్చు!)


ఇంట్లో ఎన్నో ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. నెలనెలా విద్యుత్ బిల్లు మాత్రం తడిసి మోపెడవుతూ వుంటుంది. అన్ని పరికరాలనూ అవసరాన్ని బట్టి వాడుతూనే ఉన్నా... ఏ పరికరానికి ఎంత విద్యుత్ ఖర్చవుతుందో తెలియదు. పెద్ద పరికరాలు, ఎక్కువ విద్యుత్ వినియోగించుకునే హీటర్ వంటివే ఎక్కువ విద్యుత్ బిల్లు రావడానికి కారణమని భావిస్తుంటాం. కానీ ఇది పొరపాటు. పరికరాల విద్యుత్ సామర్థ్యమేకాదు, వాటిని వినియోగించే తీరు కూడా మొత్తం విద్యుత్ వినియోగంపై ప్రభావం చూపుతుంది. మరి అసలు ఏ పరికరం ఎంత విద్యుత్ వినియోగించుకుంటుందో తెలుసుకుందాం..
వాట్స్, విద్యుత్ యూనిట్ కొలతలు ఏమిటి?
ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని కొనుగోలు చేయడానికి వెళితే వాటి విద్యుత్ వినియోగాన్ని వాట్లలో చెబుతుంటారు. మనకేమో విద్యుత్ బిల్లులు యూనిట్ల లెక్కన లెక్కించి వసూలు చేస్తారు. అందువల్ల పరికరాల విద్యుత్ వినియోగం ఎంతో తెలుసుకునే ముందు.. అసలు విద్యుత్ వినియోగాన్ని ఎలా కొలుస్తారో చూద్దాం. సాధారణంగా ప్రతి పరికరం సామర్థ్యాన్ని వాట్ (Watt)లలో కొలుస్తారు. ఉదాహరణకు 20 వాట్ల సీఎఫ్ఎల్ బల్బు, 1,200 వాట్ల (1.2 kW) హీటర్ గా చెబుతుంటారు. అంటే ఈ పరికరాలు పనిచేస్తున్న సమయంలో అంత స్థాయిలో విద్యుత్ ను వినియోగించుకుంటూ ఉంటాయి. ఇలా ఏదైనా పరికరం గంట సేపు ఒక వాట్ విద్యుత్ ను వినియోగించుకుంటే దానిని వాట్ అవర్ (WH) అంటారు, అదే 1,000 వాట్ల విద్యుత్ ను వినియోగించుకుంటే దానిని కిలో వాట్ అవర్ (kWH) గా పేర్కొంటారు.
- ఇక యూనిట్ విద్యుత్ వినియోగం అంటే 1,000 వాట్ల విద్యుత్ ను ఒక గంట సేపు నిర్విరామంగా వినియోగించడం. అంటే ఒక కిలో వాట్ అవర్ విద్యుత్ ఒక యూనిట్ అన్న మాట. ఉదాహరణకు 1,000 వాట్ల సామర్థ్యమున్నవాటర్ హీటర్ ను గంట సేపు వినియోగిస్తే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చు అవుతుంది. అదే 20 వాట్ల సీఎఫ్ఎల్ బల్బుకు ఒక యూనిట్ విద్యుత్ ఖర్చు కావాలంటే.. 50 గంటలు పడుతుంది. అంటే ఎంత తక్కువ వాట్ సామర్థ్యం ఉన్న పరికరం అంత తక్కువగా విద్యుత్ ను వినియోగించుకుంటుంది. 
ఇలా లెక్కించవచ్చు..
ఏదైనా పరికరం వాటేజ్ సామర్థ్యం, ఎన్ని గంటల పాటు వినియోగించామనే వివరాలతో దాని విద్యుత్ వినియోగాన్ని లెక్కించవచ్చు. దీనికి ఒక సూత్రం కూడా ఉంది.
విద్యుత్ వినియోగం = పరికరం వాట్ సామర్థ్యం x వినియోగించిన సమయం / 1000
  • ఉదాహరణకు 1,500 వాట్ల సామర్థ్యమున్న వాటర్ హీటర్ ను రెండు గంటల పాటు వినియోగించామనుకుంటే పై సూత్రం ప్రకారం...
  • 1500 x 2 / 1000 = 3. అంటే మూడు యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది.
ఉదాహరణకు 100 వాట్ల సామర్థ్యమున్న టీవీని ఐదు గంటల పాటు వినియోగిస్తే..
  • 100 x 5 /1000 = 0.5. అంటే ఐదు గంటల పాటు టీవీని వినియోగిస్తే అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం సగం యూనిట్ మాత్రమే. ఈ లెక్కన దీనిని పది గంటల పాటు వినియోగిస్తే ఒక యూనిట్ విద్యుత్ ఖర్చవుతుంది.
  • మనకు సాధారణంగా విద్యుత్ బిల్లు నెలకోసారి వస్తుంది. అందువల్ల ఒక పరికరానికి రోజుకు ఎంత విద్యుత్ ఖర్చవుతుందో చూసుకుని.. నెల మొత్తంలో ఎన్ని యూనిట్లు వ్యయమవుతుందో తెలుసుకోవచ్చు.
వినియోగాన్ని పరిశీలించండి
  1. ఎక్కువ వాటేజ్ సామర్థ్యమున్న పరికరాలే ఎక్కువగా విద్యుత్ ను వినియోగించుకుంటున్నాయని భావించవద్దు. పరికరాల వాటేజ్ సామర్థ్యం కంటే వినియోగించే సమయమే ప్రధానం. సాధారణంగా దేవుళ్ల చిత్రాలు, అలంకరణ బల్బులు వంటి వాటిని నిత్యం ఆన్ లోనే ఉంచుతుంటాం. ఆ బల్బు సామర్థ్యం 15 వాట్ల నుంచి 20 వాట్ల వరకు ఉంటుంది. 20 వాట్ల లెక్కన తీసుకుంటే.. రోజుకు 24 గంటల పాటు కలిపి (20 వాట్లు x 24 = ) 480 వాట్ల విద్యుత్ వినియోగించుకుంటుంది. అంటే పై సూత్రం లెక్కన రోజుకు 0.5 యూనిట్, నెలకు 15 యూనిట్లు విద్యుత్ ఖర్చవుతుంది.
  2. మరో ఉదాహరణగా ఒక వాషింగ్ మెషీన్ వినియోగాన్ని తీసుకుందాం. సాధారణంగా 6 కేజీల సామర్థ్యమున్న టాప్ లోడింగ్ వాషింగ్ మెషీన్ సామర్థ్యం 350 వాట్లు. ఇది ఒకసారి బట్టలు ఉతకడానికి గంట నుంచి గంటా 10 నిమిషాల సమయం తీసుకుంటుంది. గంట 10 నిమిషాలనే లెక్కలోకి తీసుకుంటే.. ఒకసారి/ఒకరోజు వినియోగానికి 410 వాట్ల (గంటకు 350 వాట్లు + 10 నిమిషాలకు 60 వాట్లు) విద్యుత్ ఖర్చవుతుంది. అంటే రోజుకు 0.4 యూనిట్లు, నెలకు 12 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుంది.
- ఈ రెండు ఉదాహరణలను పరిశీలించి చూస్తే... మనం పెద్దగా పట్టించుకోని ఒక చిన్న అలంకరణ బల్బు వినియోగం కంటే పెద్ద పరికరంగా భావించే వాషింగ్ మెషీన్ కు అయ్యే విద్యుత్ ఖర్చు తక్కువ. అలంకరణ బల్బులే కాదు మనం సరిగా పట్టించుకోని ఎన్నో చిన్న పరికరాలు మన విద్యుత్ వినియోగాన్ని, బిల్లులను పెంచేస్తాయి.
ఏ పరికరానికి ఎంత విద్యుత్ ఖర్చు
మనం నిత్యం వినియోగించే పరికరాల వాట్ సామర్థ్యం ఆధారంగా ఎంత విద్యుత్ వినియోగించుకుంటాయో, ఒక యూనిట్ విద్యుత్ తో ఆయా పరికరాలు ఎంతసేపు పనిచేస్తాయో ఈ టేబుల్ లో చూడవచ్చు.
పరికరంవాట్ సామర్థ్యంఒక యూనిట్ విద్యుత్ తో
ఎంతసేపు నడుస్తుంది
సీఎఫ్ఎల్ బల్బు 15 వాట్లు1566 గంటలు
సీఎఫ్ఎల్ బల్బు 20 వాట్లు2050 గంటలు
సీఎఫ్ఎల్ బల్బు 25 వాట్లు2540 గంటలు
సాధారణ బల్బు (60 వాట్స్)6016.5 గంటలు
సాధారణ బల్బు (100 వాట్స్)10010 గంటలు
ట్యూబ్ లైట్ T124025 గంటలు
ట్యూబ్ లైట్ T83628 గంటలు
ట్యూబ్ లైట్ T52836 గంటలు
సీలింగ్ ఫ్యాన్ (సాధారణ)75-9013 గంటలు
సీలింగ్ ఫ్యాన్
(సూపర్ ఎఫియెంట్)
30-5524 గంటలు
టేబుల్ ఫ్యాన్150-2006.5 గంటలు
ఏసీ (ఒక టన్ను)1,000-1,500 1 గంట
ఏసీ (1.5 టన్నులు)1,200-1,80045 నిమిషాలు
ఏసీ (3 టన్నులు)2,000-2,50030 నిమిషాలు
టీవీ (సీఆర్ టీ - 21 అంగుళాలు)130-1806.5 గంటలు
టీవీ (ఎల్ సీడీ - 21 అంగుళాలు)50-7015.3 గంటలు
టీవీ (ప్లాస్మా - 32 అంగుళాలు)250-3004 గంటలు
టీవీ (ఎల్ఈడీ - 21 అంగుళాలు)30-4026 గంటలు
రిఫ్రిజిరేటర్ (190 లీటర్లు)120-15026 గంటలు
రిఫ్రిజిరేటర్ (210 లీటర్లు)130-17024 గంటలు
రిఫ్రిజిరేటర్ (245 లీటర్లు)150-19021 గంటలు
రిఫ్రిజిరేటర్ (300 లీటర్లు)180-25020 గంటలు
రిఫ్రిజిరేటర్ (345 లీటర్లు)210-30018 గంటలు
వాషింగ్ మెషీన్
(టాప్ లోడ్ 6 కేజీ)
350-5002.6 గంటలు
వాషింగ్ మెషీన్
(ఫ్రంట్ లోడ్ 6 కేజీ)
500-600105 నిమిషాలు
క్లాత్ డ్రయ్యర్1,500-2,50035 నిమిషాలు
ఎయిర్ కూలర్250-3004 గంటలు
మిక్సర్ గ్రైండర్700-900గంటా 35 నిమిషాలు
ఇండక్షన్ స్టవ్1,500-2,00045 నిమిషాలు
ఎలక్ట్రిక్ కుక్కర్1,000-1,500గంటా 20 నిమిషాలు
మైక్రోవేవ్ ఓవెన్1,500-2,50045 నిమిషాలు
బ్రెడ్ టోస్టర్800-1,50050 నిమిషాలు
కాఫీ మేకర్800-1,200గంటా 10 నిమిషాలు
డిష్ వాషర్1,200-1,50045 నిమిషాలు
రూమ్ హీటర్1,500-2,00035 నిమిషాలు
గీజర్ (20 లీటర్లు)1,000-1,20045 నిమిషాలు
వాటర్ మోటార్ (1 హెచ్ పీ)800-1,200ఒక గంట
ఐరన్ బాక్స్1,000-1,500ఒక గంట
వాక్యూమ్ క్లీనర్300-5002.3 గంటలు
హెయిర్ డ్రయ్యర్1,000-1,500గంటా 15 నిమిషాలు
హెయిర్ ట్రిమ్మర్150-2505 గంటలు
డెస్క్ టాప్ కంప్యూటర్ 120-1507.5 గంటలు
ల్యాప్ టాప్ కంప్యూటర్50-6018 గంటలు
సీఆర్టీ మానిటర్10012 గంటలు
ఎల్సీడీ మానిటర్4025 గంటలు
ఇంక్ జెట్ ప్రింటర్20-3036 గంటలు
హోం థియేటర్60-10014 గంటలు
సెట్ టాప్ బాక్స్8-10120 గంటలు
సెట్ టాప్ బాక్స్ (రికార్డబుల్)18-2070 గంటలు
సెల్ ఫోన్ చార్జర్లు5-8150 గంటలు
రూటర్లు, మోడెమ్ లు5-10140 గంటలు
నోట్: రిఫ్రిజిరేటర్ల వాటేజ్ సామర్థ్యం ఎక్కువే అయినా అవి కూల్ అయ్యాక వాటంతట అవే ఆఫ్ అవుతాయి. కూలింగ్ తగ్గగానే తిరిగి ఆన్ అవుతాయి. అందువల్ల వాటి విద్యుత్ వినియోగం తక్కువ. ఇక ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్ల విద్యుత్ వినియోగం ఇందులో పేర్కొన్న దానికన్నా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇచ్చిన పరికరాలన్నీ స్టాండర్డ్ క్వాలిటీకి అనుగుణంగా తీసుకుని విద్యుత్ వినియోగాన్ని లెక్కించినవి. స్టార్ రేటింగ్, టెక్నాలజీ వినియోగం, ఎంతకాలం నుంచి పరికరాన్ని వినియోగిస్తున్నారనే అంశాలపై ఆధారపడి విద్యుత్ వినియోగం మారుతుంది.
ఇవి గుర్తుంచుకోండి
  • ఇళ్లలో ఎక్కువ విద్యుత్ వినియోగించుకునే పరికరాలు సీలింగ్/ టేబుల్ ఫ్యాన్లు. ఎందుకంటే వాటిని దాదాపుగా రోజంతా ఉపయోగిస్తుంటాం. సాధారణ సీలింగ్ ఫ్యాన్ల విద్యుత్ వినియోగం 75 నుంచి 90 వాట్లు. అంటే రోజుకు 12 గంటల పాటు వినియోగించినా.. రోజుకు ఒక యూనిట్, నెలకు 30 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఈ లెక్కన 3 సీలింగ్ ఫ్యాన్ల వినియోగమే నెలకు 80 నుంచి 100 యూనిట్ల దాకా ఉంటుంది. వీటి స్థానంలో సూపర్ ఎఫిషియెంట్/ స్టార్ రేటెడ్ ఫ్యాన్లను వినియోగించవచ్చు. వీటి విద్యుత్ వినియోగం 30 నుంచి 55 వాట్లు. అంటే సాధారణ ఫ్యాన్లతో పోలిస్తే విద్యుత్ వినియోగం సగానికిపైగా తగ్గుతుంది.
  • వెలుతురు కోసం ఎల్ఈడీ బల్బులు లేదా టీ5 ట్యూబ్ లైట్లు, సీఎఫ్ఎల్ బల్బులను వినియోగించడం మంచిది. ఖరీదు ఎక్కువైనా ఎల్ఈడీ బల్బుల మన్నిక, విద్యుత్ పొదుపు చాలా ఎక్కువ. అయితే బాత్రూమ్ లు, ఇంటి ఆవరణల్లో ఉండే బల్బుల వినియోగం బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి సీఎఫ్ఎల్ లు సరిపోతాయి.
  • ఇన్వర్టర్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లను  వినియోగించండి. అవి విద్యుత్ ను పెద్ద మొత్తంలో ఆదా చేస్తాయి. 
  • టీవీల్లో ఎల్ సీడీ, ప్లాస్మా తరహాల కంటే ఎల్ఈడీ టీవీలు మేలు.
  • పరికరాల విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా కొలవడానికి ‘కిల్ ఏ వాట్ మీటర్ (కిలో వాట్ మీటర్)’ పేరిట పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ప్లగ్ లో పెట్టి, పరికరాన్ని దానికి అనుసంధానం చేస్తే... పరికరం వాటేజ్ సామర్థ్యం నుంచి విద్యుత్ వినియోగం, పవర్ ఫ్యాక్టర్ దాకా కచ్చితంగా వెల్లడిస్తాయి.